Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

లాజిస్టిక్‌ స్పేస్‌ @ 3.8 కోట్ల చ.అ.

దేశంలో లాజిస్టిక్, వేర్‌ హౌజ్‌ విభాగం ఫుల్‌ జోష్‌లో ఉంది. మౌలిక రంగ హోదా, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి నిర్మాణాత్మక సంస్కరణల అమలు కారణంగా దేశీయ లాజిస్టిక్‌ విభాగంలో డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలో 3.8 కోట్ల చదరపు అడుగుల లాజిస్టిక్‌ అండ్‌ వేర్‌ హౌజ్‌ స్పేస్‌ సప్లయి వస్తుందని జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది.
215 బిలియన్‌ డాలర్లకు పరిశ్రమ..
ఏటా దేశీయ లాజిస్టిక్‌ విభాగం 33.81 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. 2020 నాటికి ఈ పరిశ్రమ 215 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది. 2018లో 3.2 కోట్ల చ.అ. స్థలం లీజుకు పోగా.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో 84 లక్షల చ.అ. స్థలాన్ని తీసుకున్నారని జేఎల్‌ఎల్‌ తెలిపింది. ఇంజనీరింగ్, ఆటో మరియు అనుబంధ సంస్థలు, ఈ–కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, టెలికం విభాగాలు లాజిక్టిక్‌ వృద్ధి చోదకాలని జేఎల్‌ఎల్‌ ఇండియా కంట్రీ హెడ్‌ అండ్‌ సీఈఓ రమేష్‌ నాయర్‌ తెలిపారు. లాజిస్టిక్‌ సప్లయి చైన్‌లో జీఎస్‌టీ రాకతో సవాళ్లు తొలగాయి. ఒకే రకం పన్ను విధానం అమల్లోకి రావటంతో లావాదేవీలు, పన్ను వసూళ్లలో స్పస్టత ఏర్పడిందని దీంతో ఈ రంగంలో డిమాండ్‌ పెరిగిందని తెలిపారు.
ఏ సంవత్సరంలో ఎంతంటే?
2015లో మొత్తం 1.02 కోట్ల చ.అ. లీజుకు పోగా.. ఇందులో 49 లక్షలు గ్రేడ్‌–ఏ, 53 లక్షలు గ్రేడ్‌–బీ స్పేస్‌ ఉంది. 2016లో 1.32 కోట్ల చ.అ. కాగా.. ఇందులో 56 లక్షలు గ్రేడ్‌–ఏ, 76 లక్షలు గ్రేడ్‌–బీ ఉంది. ఇక, 2017లో 1.97 కోట్ల చ.అ. ఉండగా.. 98 లక్షలు గ్రేడ్‌–ఏ, 99 లక్షలు గ్రేడ్‌–బీ స్థలం లీజుకు పోయింది. గతేడాది మొత్తం 3.18 కోట్ల చ.అ. స్పేస్‌ పోగా.. ఇందులో 1.77 కోట్ల చ.అ. గ్రేడ్‌–ఏ, 1.41 కోట్ల చ.అ. గ్రేడ్‌–బీ స్థలం ఉంది.

Related Posts

Latest News Updates