Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

లింగమనేని గెస్ట్‌ హౌజ్‌ అక్రమమే!

విజయవాడ కేంద్రంగా సేవలందిస్తున్న విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా చైర్మన్, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఆత్మీయుడు అయిన లింగమనేని రమేష్‌కు.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) షోకాజు నోటీసులు జారీ చేసింది. గుంటూరు ఉండవల్లిలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌ అక్రమ నిర్మాణమని సీఆర్‌డీఏ 2014 సెక్షన్‌ 115 (1), 115 (2) కింద నోటీసును జారీ చేశారు. అక్రమ నిర్మిత భవనాన్ని 7 రోజుల్లోపు నిర్మూలించాలని లేని పక్షంలో ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుందని షోకాజు నోటీసు సారాంశం.
చంద్రబాబు నివాసం ఇదే..
ఆంధ్రప్రదేశ్‌ కార్యకలాపాలు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. లింగమనేని గెస్ట్‌ హౌజ్‌ విల్లాలోనే నివాసమున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు దీన్నే నివాసంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏడాది తర్వాత గెస్ట్‌ హౌజ్‌కు సమీపంలో హెలీప్యాడ్, ప్రజా వేదికను కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు.
అనుమతుల్లేవ్‌…
ఉండవల్లిలో కృష్ణా నది నుంచి 100 మీటర్ల లోపు 6 సెంట్ల స్థలంలో లింగమనేని ఎస్టేట్స్‌ను నిర్మించారు. చట్టం ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా జీ+మొదటి అంతస్తు నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆర్‌సీసీ రూమ్, స్విమ్మింగ్‌ పూల్, హెలీప్యాడ్‌ నిర్మాణాలున్నాయి. సీఆర్‌డీఏ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఈ స్థలంలో 10 తాత్కాలిక షెడ్లను నిర్మించారు.

Related Posts

Latest News Updates