Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

వంశీరామ్‌ నుంచి తోషిబాకు భారీ ఆర్డర్‌

ప్రముఖ ఎలివేటర్స్‌ తయారీ కంపెనీ తోషిబా జాన్సన్‌ ఎలివేటర్‌ ఇండియా (టీజేఈఐ)కు హైదరాబాద్‌ నుంచి అతిపెద్ద ఆర్డర్‌ వచ్చింది. నగరానికి చెందిన వంశీరామ్‌ బిల్డర్స్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మిస్తున్న రెండు కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లకు ఎలివేటర్స్‌ సప్లయి ఆర్డర్‌ను అందించింది. బీఎస్‌ఆర్‌ టెక్‌ పార్క్, జ్యోతి టెక్‌ పార్క్‌లకు 82 ఎలివేటర్ల సప్లయి, ఇన్‌స్టాలేషన్, నిర్వహణ సేవలు తోషియా అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని సెజ్‌లో 2 లక్షల చదరపు అడుగుల్లో బీఎస్‌ఆర్‌ టెక్‌ పార్క్‌ను నిర్మిస్తోంది. జీ+19 అంతస్తుల్లోని ఈ ప్రాజెక్ట్‌ మార్చి 2020 నాటికి పూర్తవుతుంది.


అల్ట్రా ప్రీమియం సేఫ్టీ..
ఈ సందర్భంగా టీజేఈఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జునిచీ క్యూషిమా మాట్లాడుతూ.. నిర్మాణ రంగం ఉత్పత్తుల విభాగంలో సరికొత్త సాంకేతికతను తీసుకురావటం, సులువైన నిర్వహణ వంటి వాటితో దేశీయ కమర్షియల్‌ విభాగంలో తోషియా ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగిందని తెలిపారు. అల్ట్రా ప్రీమియం భవనాలకు అల్ట్రా ప్రీమియం సేఫ్టీ ఉత్పత్తులను అందిస్తున్నామని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates