Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వరంగల్‌లో ఒకే భూమి రెండుసార్లు రిజిస్ట్రేషన్‌

హైదరాబాద్‌లోని మియాపూర్‌ రిజిస్ట్రేషన్స్‌ స్కామ్‌ తరహాలోనే వరంగల్‌లోనూ చోటు చేసుకుంది. ఒకే భూమిని ఇద్దరి పేర్ల మీద డబుల్‌ రిజిస్ట్రేషన్స్‌ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
గిర్మాజీపేటలో..
వరంగల్‌ అర్బన్‌ జిల్లా గిర్మాజీపేట సర్వే నంబరు 20, 21, 22లో భూమి తనదంటూ 1972లో జారీ చేసిన స్టాంప్‌ పేపరు ఆధారంగా గుండ్ల రమేశ్‌ బాబు అనే వ్యక్తి 2006లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ సమయంలో ఆయన సమర్పించిన రేషన్‌కార్డులో 1965లో పుట్టారని ఉంది. ఈ లెక్కన 1972 నాటికి రమేశ్‌బాబు వయస్సు 7 సంవత్సరాలు. కానీ, ఇతనికి 18 సంవత్సరాలని ఆర్డీఓ జారీ చేసిన డి.డిఎస్‌.నం.ఎ/4665/2000 ధ్రువపత్రంలో ఉంది. భూమి కొన్నట్లుగా సమర్పించిన ఆర్డీఓ ధ్రువపత్రంలో లక్ష్యిపురంలో భూమి అని ఉంటే గిర్మాజీపేటలో భూమి అని రిజిస్ట్రేషన్‌ చేశారు.
శ్రీనివాస్‌ పేరు మీద ఇప్పుడు..
రికార్డులో లేని రాయబహదూర్‌ శ్రీకిషన్‌ అనే వ్యక్తి పేరు మీద భూమి కొన్నట్లు చూపించారు. ఇంతటితో ఆగకుండా 2011లో వంగల శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని విక్రయించినట్లు రెండోసారి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇందులో భూమి అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తిగా రెండు చోట్లా శ్రీనివాస్‌రెడ్డి ఫొటోలు, సంతకం ఉండటం కొసమెరుపు. రిజిస్ట్రేషన్‌ సమయంలో తప్పులు జరిగాయని, బాధితులు ఆధారాలతో సహా ఐజీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మీద పూర్తి స్థాయి నివేదిక రూపొందించి, తప్పుడు రిజిస్ట్రేషన్స్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ చిరంజీవులు తెలిపారు.

Related Posts

Latest News Updates