Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వరంగల్‌ టెక్నికల్‌ కన్సల్టెన్సీపై టీఎస్‌–రెరా క్రిమినల్‌ కేసు

తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌–రెరా) అసలు అస్త్రాలను సంధించేందుకు సిద్ధమవుతోంది. రెరాలో ప్రాజెక్ట్‌లను నమోదు చేయని డెవలపర్ల మీద, తప్పుడు సమాచారం అందించిన టెక్నికల్‌ కన్సల్టెన్సీ మీద జరిమానాలు, క్రిమినల్‌ కేసులను విధించనుంది.
హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలో ఓ డెవలపర్‌ ప్రాజెక్ట్‌ను నమోదు చేయకుండానే విక్రయిస్తున్నాడని, అతనికి ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా విధించాలని టీఎస్‌–రెరా చైర్మన్‌ రాజేశ్వర్‌ తివారీ అధికారులు ఆదేశించారు. అలాగే వరంగల్‌కు చెందిన ఓ టెక్నికల్‌ కన్సల్టెన్సీ వెబ్‌సైట్‌లో తప్పుడు సమాచారంతో డెవలపర్లను చీటింగ్‌ చేస్తున్నందుకు కన్సల్టెన్సీ మీద క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు చైర్మన్‌ రాజేశ్వర్‌ తివారీ నిర్ణయించారు.
రూ.66 లక్షల జరిమానా..
శేరిలింగంపల్లిలో ఓ ప్రముఖ డెవలపర్‌ రూ.6.6 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అర్హత ఉన్నా రెరాలో నమోదు చేయలేదు కాబట్టి ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా అంటే రూ.66 లక్షలు జరిమానాగా విధించనున్నామని టీఎస్‌–రెరా సెక్రటరీ కె. విద్యాధర్‌ తెలిపారు. అయితే ముందుగా డెవలపర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని, ఆ తర్వాత జరిమానా విధిస్తామని విద్యాధర్‌ తెలిపారు. టీఎస్‌–రెరా చట్టం ప్రకారం జరిమానా చర్యలు తీసుకోవటం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
5,600 ప్రాజెక్ట్‌ల నమోదు..
తెలంగాణలో రెరా ఆగస్టు 2018లో అమలులోకి వచ్చింది. 2017 జనవరి 1 తర్వాత 500 చదరపు మీటర్లు లేదా 8 ఫ్లాట్లకు పైన ఉన్న ప్రతి ప్రాజెక్ట్‌ టీఎస్‌–రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. గతేడాది నవంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు పలుమార్లు రెరా రిజిస్ట్రేషన్‌ గడువును పొడిగిస్తూ వచ్చింది. ప్రస్తుతం రూ.3 లక్షల జరిమానాతో నమోదు గడువు ఉంది. ఇప్పటివరకు టీఎస్‌–రెరాలో 5,600 ప్రాపర్టీలు నమోదయ్యాయి. వీటిలో 80 శాతం ప్రాపర్టీలు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. సుమారు 2,600 ప్రాపర్టీలు స్క్రూట్ని జరిగింది. ఆన్‌లైన్‌లో సమగ్రంగా వివరాలను నమోదు చేయని సుమారు 450 మంది డెవలపర్లకు నోటీసులు జారీ చేశారు.

Related Posts

Latest News Updates