మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమైన ఐటీ హబ్.. తూర్పు ప్రాంతానికి విస్తరించనుంది. వరంగల్ జాతీయ రహదారిలో ఐటీ క్లస్టర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలను ఆకర్షించేందుకు లుక్ ఈస్ట్ పాలసీని రూపొందిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఎలక్షన్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారంలో పాలసీని అధికారికంగా విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఇప్పటికే పోచారంలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
సబ్సిడీలు, గ్రాంట్స్..
ఉప్పల్, భువనగిరి, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తుంది. కొత్తగా కంపెనీని ఏర్పాటు చేసే వాటికి మూడు సంవత్సరాల వరకు 25 శాతం విద్యుత్ సబ్సిడీని అందిస్తుంది. గరిష్టంగా ఏడాదికి 25 లక్షల పరిమితి. రిక్రూట్మెంట్ గ్రాంట్ కింద యూనిట్‌కు 20 వేలు. గరిష్టంగా ఏడాదికి కోటి రూపాయల పరిమితి. రెంటల్ సబ్సిడీ 25 శాతం ఉంటుంది. గరిష్టంగా యూనిట్‌కు 50 వేలు పరిమితి. మూడు సంవత్సరాల పాటు ఉచిత ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్