Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

వరల్డ్‌ జీబీసీ ఏపీఎన్‌ చైర్మన్‌గా రఘుపతి నియామకం

వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (వరల్డ్‌ జీబీసీ) ఆసియా పసిఫిక్‌ నెట్‌వర్క్‌ (ఏపీఎన్‌)కు చైర్మన్‌గా ఎస్‌. రఘుపతి నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో కొనసాగడం వరుసగా రెండోసారి. ప్రస్తుతం రఘుపతి సీఐఐ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్, ఐజీబీసీ ఇన్‌చార్ట్‌గా కూడా ఉన్నారు. 2019 జులై 1 నుంచి 2023 జూన్‌ వరకు రఘుపతి ఈ పదవిలో కొనసాగుతారని జీబీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీఎన్‌లో 15 దేశాలున్నాయి. ఏపీఎన్‌ రీజియన్‌లో పర్యావరణహితమైన ప్రాజెక్ట్‌లను ప్రమోట్‌ చేయడం, అవగాహన కల్పించడం ఈయన బాధ్యత.

Related Posts

Latest News Updates