Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌ నగరం మరొక అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఇప్పటికే గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) నిర్వహణతో ప్రపంచ దేశాలను ఆకర్షించిన భాగ్యనగరం మరొక ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 11, 12 తేదీల్లో 31వ ద్వైపాక్షిక వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రతీ రెండేళ్లకోసారి వరల్డ్‌ డిజైన్‌ క్యాపిటల్‌ పేరిట ఒక్కో నగరాన్ని ఎంపిక చేసి సదస్సులు జరుగుతుంటాయి. వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల నుంచి బిడ్‌లను ఆహ్వానించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణకు ఆయా నగరాల్లో ఉన్న అనుకూలతలను పరిశీలించిన డబ్ల్యూడీఓ హైదరాబాద్‌ను ఎంపిక చేసింది.
ఐసీఎస్‌ఐడీ నుంచి డబ్ల్యూడీఓగా మార్పు..
ఐక్య రాజ్య సమితి సుస్తిర అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 1957లో ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ డిజైన్‌ (ఐసీఎస్‌ఐడీ) ఏర్పాటైంది. తొలుత 12 వృత్తి నైపుణ్యం కలిగిన డిజైన్‌ అసోసియేషన్లతో ఏర్పాటైన ఐసీఎస్‌ఐడీ 2015 అక్టోబర్‌లో వరల్డ్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌గా పేరును మార్చుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 140 డిజైన్‌ అసోసియేషన్లు డబ్ల్యూడీఓలో సభ్యత్వం కలిగి ఉన్నాయి.

Related Posts

Latest News Updates