Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

విద్యార్థులకు 50 శాతం రాయితీ ప్రకటించిన ‘మేజర్’చిత్ర యూనిట్

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ చిత్రం యూనిట్ ఓ కీలకమైన ఆఫర్ ప్రకటించింది. విద్యార్థులకు టిక్కెట్ ధరపై 50 శాతం రాయితీ ప్రకటించింది. మేజర్ సందీప్ ఉన్ని కష్ణన్ జీవితం గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రాయితీ అని చిత్ర యూనిట్ ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా షో వేస్తామని, అందుకోసం majorscreening@gmail.com కి మెయిల్ చేసిన ఈ అవకాశాన్ని పొందాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది.

మరో వైపు ఈ నిర్ణయంపై హీరో అడవి శేష్ కూడా స్పందించాడు. తాము చేసిన ఈ సినిమాకు చిన్నారుల నుంచి విశేషంగా స్పందన వస్తోందని, ఇందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నారుల కోసమే రాయితీ అని తెలిపారు. ఉన్నికృష్ణన్ జీవితం గురించి విద్యార్థులకు తెలియాలన్న తపనతోనే ఈ నిర్ణయం అని అడవి శేష్ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates