షాద్‌నగర్ దగ్గర్లోని విట్యాలలో స్పేస్ విజన్ ఆంబియెన్స్ పేరిట 300 ఎకరాల్లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే ఫేజ్–1లో 74 ఎకరాల్లో వెంచర్‌ను పూర్తి చేసింది. ఫేజ్–2లో మరో 87 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.– ఫేజ్–2లో 147 గజాల నుంచి వెయ్యి గజాల మధ్య ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.3,500. క్లబ్ హౌస్‌తో పాటూ 60, 40 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్లు, అవెన్యూ ప్లాంటేషన్, స్విమ్మింగ్ పూల్, స్పా, మెడిటేషన్ సెంటర్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గోల్ఫ్ కోర్ట్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఇండోర్ గేమ్స్, పార్క్ వంటి అన్ని రకాల గేటెడ్ కమ్యూనిటీ వసతులుంటాయి. రెండేళ్లలో క్లబ్ హౌజ్ నిర్మాణం పూర్తవుతుంది. జడ్చర్ల దగ్గర్లోని పోలెపల్లి సెజ్ దగ్గర 4 ఫామ్ హౌస్ ప్రాజెక్ట్‌లను కూడా చేస్తున్నాం. ఇందులో ఎకరం, అర ఎకరం, పావు ఎకరం చొప్పున వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేస్తుంది.