షాద్నగర్లో లోర్నా గ్రీన్స్ పేరిట 60 ఎకరాలను అభివృద్ధి చేస్తుంది విర్టుసా లైఫ్ స్పేసెస్. ఇందులో మొత్తం 560 ప్రీమియం వ్యక్తిగత గృహాలు, ఓపెన్ ప్లాట్లుంటాయి. వీటిల్లో 200ల సింప్లెక్స్, డూప్లెక్స్లను నిర్మిస్తున్నాం. ఒక్కో విల్లా 200 గజాల్లో 1,100 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటుంది. 200 గజాల నుంచి 400 గజాల్లో ఓపెన్ ప్లాట్లుంటాయి.
– షాద్నగర్ పట్టణంలో తొలిసారిగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రెండున్నర ఎకరాల్లో సెంట్రల్ పార్క్, 12 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్లను నిర్మిస్తుంది. 60, 40, 30 ఫీట్ల సీసీ రోడ్లు, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్, గ్రాసరీ అండ్ మెడికల్ స్టోర్, అవెన్యూ ప్లాంటేషన్ వంటి వసతులను ఏర్పాటు చేస్తుంది.
– కొంపల్లి దగ్గర్లోని గౌడవల్లిలో 45 ఎకరాల్లో ఇకానా మెడోస్ను అభివృద్ధి చేస్తుంది. ఇందులో కూడా వ్యక్తిగత గృహాలు, ఓపెన్ ప్లాట్లు కలిపి ఉంటాయి. మొత్తం 150 విల్లాలు. ఒక్కో విల్లా 200 గజాల్లో 1,100 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటుంది. 150 గజాల నుంచి 350 గజాల మధ్య ఓపెన్ ప్లాట్లుంటాయి. రోడ్లు, వీధి దీపాలు, మురుగు నీటి వ్యవస్థ, వాటర్ ట్యాంక్, గ్యాస్ పైప్ లైన్స్ వంటి ఏర్పాట్లతో పాటూ 4 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్ కూడా ఉంటుంది.