Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

షాన్‌దార్‌ షాద్‌నగర్‌

హైదరాబాద్‌లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక నగరం చుట్టూ ఉన్న జిల్లా కేంద్రాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ జాబితాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది షాద్‌నగర్‌ గురించి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి అదనపు ఆకర్షణ. విశాలమైన రోడ్లు, మెరుగైన వసతులతో షాద్‌నగర్‌ మినీ నగరంగా అభివృద్ధి చెందుతుంది.
స్థానికంగా సొంతిల్లే బెటర్‌..
గతంలో హైదరాబాద్‌లో అద్దెకుంటూ ప్రతి రోజూ ఉద్యోగం కోసం షాద్‌నగర్‌కు ప్రయాణించేవారు. కానీ, ఇప్పుడు స్థానికంగానే గృహాలను ఏర్పాటు చేసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారని ఓ డెవలపర్‌ తెలిపారు. రైలు, బస్సు సౌకర్యాలు విరివిగా ఉండటం, ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో ప్రయాణం సులువవ్వటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం ఆలోచించేవాళ్లు ఓపెన్‌ ప్లాట్లను, స్థిర నివాసం ఏర్పాటు చేసేకునే వాళ్లు వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. విశాలమైన రోడ్లు, మెరుగైన మౌలిక వసతులతో పాటూ భూగర్భ జల వనరులకూ కొదవేలేదిక్కడ. ఇక్కడ 650 ఎంసీఎం వరకు నీరు అందుబాటులో ఉందని ది సెంట్రల్‌ గ్రౌండ్‌ బోర్డ్‌ లెక్కలే చెబుతున్నాయి. అంతర్జాతీయ స్కూల్స్, ఆసుపత్రులున్నాయి. ఈ మార్గంలో బయోకన్జర్వేషన్‌ జోన్‌ కింద 20 కి.మీ. పరిధి ఉండటంతో ఆ తర్వాత ఉన్న ప్రాంతం పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.


రెండేళ్లలో 70 శాతం పెరిగిన ధరలు..
షాద్‌నగర్‌ కేంద్రంగా బిల్డింగ్‌ బ్లాక్స్, విర్టుసా, స్పేస్‌ విజన్, డీఎల్‌ఎఫ్, గిరిధారి, సీఎస్‌కే వంటి కనీసం 30 ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లున్నాయి. గజం రూ.4 వేలు నుంచి రూ.13 వేల వరకున్నాయి. పట్టణానికి అనుసంధానమై ఉన్న ప్రాంతాలు, బస్‌ స్టాండ్‌కు 2 కి.మీ. పరిధిలోని ప్రాంతాల్లో అయితే గజం రూ.20 వేల వరకున్నాయి. 1,000 చ.అ. అపార్ట్‌మెంట్‌ ధర రూ.30 లక్షల నుంచి, 150 గజాల్లోని ఇండిపెండెంట్‌ హౌజ్‌ రూ.40 లక్షల నుంచి ఉన్నాయి. ఎకరం స్థలం ధర రూ.60–80 లక్షలుంది. మెయిన్‌ రోడ్డు నుంచి కాస్త లోపలికి వెళితే రూ.45–50 లక్షల్లోపూ దొరుకుతున్నాయి. గత రెండేళ్లలో షాద్‌నగర్‌లో ధరలు 70 శాతం పెరిగాయని.. వచ్చే ఏడాది కాలంలో మరో 40–50 శాతం పెరిగే అవకాశముంది.
కంపెనీలెన్నో..
షాద్‌నగర్‌లో కొత్తూరు, జడ్చర్ల, ఫరూక్‌నగర్, ఎలికట్ట, పరిగి రోడ్, పాత బెంగళూరు రోడ్‌ ప్రాంతాలు ప్రధానమైనవి. షాద్‌నగర్, కొత్తూరు, కొందుర్గు వంటి ప్రాంతాల్లో సుమారు 10 వేలకు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), 20కి పైగా బహుళ జాతి కంపెనీలున్నాయి. అమెజాన్, ఏషియన్‌ పెయింట్స్, సింబయాసిస్‌ వర్సిటీ, హల్దీరామ్స్, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ (పీ అండ్‌ జీ), జాన్సన్‌ అండ్‌ జాన్సన్, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ), కోజంట్, అరబిందో, మైవాన్, ఎల్వీ ప్రసాద్, నాట్కో వంటి బహుళ జాతి సంస్థలున్నాయి. ఆయా కంపెనీ అన్నింట్లో కలిపి సుమారు 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తారని అంచనా. వీరందరికీ వారి వారి బడ్జెట్‌లో గృహాలు నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ప్రణాళికలు చేస్తున్నాయి.

Related Posts

Latest News Updates