Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

షాపూర్జీ – హైన్స్‌ @ పార్క్‌వెస్ట్‌ ఫేజ్‌–4

ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ, అమెరికాకు చెందిన ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ హైన్స్‌తో జట్టు కట్టింది. రెండు కలిసి బెంగళూరులో ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నాయి. ఇరు కంపెనీల మధ్య రూ.425 కోట్ల జాయింట్‌ వెంచర్‌ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. బెంగళూరులోని బిన్నీపేట్‌లో పార్క్‌వెస్ట్‌ ప్రీమియం నివాస సముదాయాన్ని నిర్మించున్నాయి.
ఫేజ్‌–4 ఈ ఏడాదే..
మొత్తం 47 ఎకరాల్లోని పార్క్‌వెస్ట్‌ ప్రాజెక్ట్‌లో 48 లక్షల చదరపు అడుగుల సేలబుల్‌ ఏరియాలో నిర్మిస్తోంది. మొత్తం నాలుగు దశల్లోని పార్క్‌వెస్ట్‌లో 2,900 గృహాలుంటాయి. 31 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ ఇది. ధర రూ.60 లక్షల నుంచి రూ.2.5 కోట్లుగా ఉంది. ఇప్పటికే ఫేజ్‌–1 గృహాలను విక్రయించేసింది. ఫేజ్‌–2లో షాపూర్జీ పల్లోంజి ఇండిపెండెంట్‌గా తీసుకుంది. ఫేజ్‌–3లో 3.2 లక్షల చదరపు అడుగుల్లో ఇటీవలే ప్రారంభించింది. ఫేజ్‌–4లో 14.8 లక్షల చదరపు అడుగుల్లో ఈ ఏడాది ముగింపు నాటికి ప్రారంభించనుంది. గతంలో హైన్స్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్, టాటా హౌజింగ్, కాన్సియంట్‌ గ్రూప్‌తో కలిసి ఎన్‌సీఆర్, ముంబై నగరాల్లో ప్రాజెక్ట్‌లను చేపట్టింది.

Related Posts

Latest News Updates