Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

సర్వే నంబర్స్‌ 103, 104లకు నకిలీ పత్రాలు

చెరువు భూములకు నకిలీ పత్రాలు సృష్టించి.. లే–అవుట్‌ చేసి కోట్లుదండుకున్నారు కబ్జాదారులు. హఫీజ్‌పేట సర్వే నంబర్స్‌ 103, 104లోని కొత్తకుంట చెరువులోని 515 ఎకరాల భూమిలో 3 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించారని శేరిలింగంపల్లి సీపీఐ కార్యదర్శి కనకమామిడి శ్రీశైలంగౌడ్‌ ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శేరిలింగంపల్లి తహశీల్దార్‌ వంశీ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్‌ ఆర్డీఓ, మియాపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌లకు ప్రభుత్వ భూమి కాపాడాలని ఫిర్యాదు కూడా చేశామన్నారు. గతంలో కూడా ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారని, కానీ, కొంత మంది కబ్జాదారులు రాత్రికి రాత్రే బోర్డును తొలగించారని ఆరోపించారు.

Related Posts

Latest News Updates