హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం నూతన భవనాలకు శ్రీకారం చుట్టింది. వారసత్వ (హెరిటేజ్) భవనాలతో సహా పలు పాత ప్రభుత్వ బిల్డింగ్లనూ కూల్చేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని నిర్ణయించింది. ఈ జాబితాలో సచివాలయం, శాసన సభ, శాసన మండలి, క్యాంప్ ఆఫీస్, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు వంటివి ఉన్నాయి. ఆయా భవన నిర్మాణాలకు తొలి దశ అంచనా వ్యయం రూ.1560 కోట్లు. ఇటీవలే రూ.125 కోట్ల వ్యయంలో కొత్తగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను నిర్మించిన సంగతి తెలిసిందే.
సీఎం క్యాంప్ ఆఫీస్..
బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌లో లక్ష చదరపు అడుగుల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ మరియు నివాస భవనం. 2 బ్లాక్స్‌లో రెండు అంతస్తుల్లో ఉంటుంది. నిర్మాణ వ్యయం 40 కోట్లు. తొలి దశ నిధులు రూ.33 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన రూ.7 కోట్లు నిర్మాణ పనులు తుది దశలో విడుదల చేస్తారు.
కొత్త సచివాలయం..
హుస్సేన్ సాగర్ సమీపంలోని సెక్రటేరియట్‌ను కూల్చేసి వాటి స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తోంది. 6 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో కొత్త సచివాలయం ఉంటుంది. తొలి దశ నిర్మాణ వ్యయం అంచనా రూ.250 కోట్లు
తెలంగాణ కళా భారతి..
ఎన్టీఆర్ స్టేడియంలో 5 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో తెలంగాణ కళా భారతి కల్చరల్ కం కన్వెన్షన్ సెంటర్. మొత్తం 10 అంతస్తులుంటాయి. నిర్మాణ వ్యయం రూ.300 కోట్లు.
శాసన సభ, మండలి భవనాలు..
ఎర్రమంజిల్‌లోని ప్రస్తుత ఆర్అండ్బీ కార్యాలయం స్థానంలో కొత్తగా శాసన సభ, శాసన మండలి భవనాల నిర్మాణం. సుమారు 5–8 ఎకరాల స్థలం అవసరం. తొలి దశ నిర్మాణ వ్యయం అంచనా రూ.300 కోట్లు.
ఎమ్యెల్యేల నివాస సముదాయం..
హైదర్‌గూడ ఆదర్శనగర్‌లో పాత ఎమ్యెల్యే క్వార్టర్స్ స్థానంలో 3 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో 12 అంతస్తుల్లో 120 గృహాలను నిర్మించారు. నిర్మాణ వ్యయం రూ.125 కోట్లు.
రాజ్‌భవన్ క్వార్టర్స్..
సోమాజిగూడలో 2 లక్షల చదరపు అడుగుల్లో రాజ్‌భవన్ క్వార్టర్స్‌ను నిర్మిస్తోంది. నాలుగు బ్లాక్‌లు, ఐదు అంతస్తుల్లో ఉంటుంది. నిర్మాణ వ్యయం రూ.90 కోట్లు.
కమాండ్ కంట్రోల్ భవనం..
లక్డీకపూల్లో కొత్తగా కమాండ్ కంట్రోల్‌ను నిర్మిస్తోంది. నిర్మాణ వ్యయం రూ.350 కోట్లు. ఈ భవనం 5 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో 20 అంతస్తుల్లో విస్తరించి ఉంటుంది.
ఇతర జిల్లాల పరిధిలోనూ..
రాష్ట్రంలోని ప్రతి శాసన సభ నియోజకవర్గంలో ఎమ్యెల్యేల క్యాంప్ ఆఫీసులను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. 4.16 లక్షల చదరపు అడుగుల్లో మొత్తం 104 భవనాలను నిర్మించనుంది. ఒక్కో క్యాంప్ ఆఫీసు 4 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. నిర్మాణ వ్యయం రూ.104 కోట్లు.