హైదరాబాద్ డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రెరా, జీఎస్టీ అమల్లోకి వచ్చాక కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభం కంటే పాత ప్రాజెక్ట్‌ల నిర్మాణాల పూర్తి మీదే దృష్టిసారిస్తున్నారు. దీంతో 2019 తొలి ఆర్ధ సంవత్సరంలో (హెచ్1) హైదరాబాద్ స్థిరాస్తి అమ్మకాల్లో వృద్ధి, కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లో క్షీణత నమోదైంది. జనవరి–జూన్ మధ్య కాలంలో నగరంలో 9,036 ఫ్లాట్లు అమ్ముడుపోగా.. కేవలం 4,363 ఫ్లాట్లు ప్రారంభమయ్యాయి.
ఏ సంవత్సరంలో ఎంతంటే?
హైదరాబాద్‌లో 2016 హెచ్1లో 5,513 గృహాలు, హెచ్2లో 3,363 గృహాలు విక్రయమయ్యాయి. 2017 హెచ్1లో 1,768, హెచ్2లో 1,724 గృహాలు, 2018 హెచ్1లో 5,476, హెచ్2లో 7,726 గృహాలు అమ్ముడుపోయాయి. ఇక, లాంచింగ్స్ చూస్తే.. 2016 హెచ్1లో 10,905, హెచ్2లో 3,702 ఫ్లాట్లు,2017 హెచ్1లో 4,484, హెచ్2లో 6,123 ఫ్లాట్లు, 2018 హెచ్1లో 8,920, హెచ్2లో 6,375 ఫ్లాట్లు ప్రారంభమయ్యాయని జేఎల్ఎల్ ఇండియా సర్వే తెలిపింది.