భాగ్యనగరి అభివృద్ధిలో, ఆదాయంలోనూ భాగస్వామి..
ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, ఆర్ధిక సంస్థలకు నిలయం..
ప్రతికూల వాతావరణంలోనూ స్థిరాస్తి అమ్మకాలకు చిరునామా..
అంతర్జాతీయ విద్యా, వైద్య, వినోద సంస్థలతో నిత్యం కిటకిటలాడే ప్రాంతం..
.. ఈ ఉపోద్ఘాతమంతా పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి గురించి. స్థిరాస్తి రంగంలోనే కాదు నగరాభివృద్ధిలోనూ వెస్ట్ జోన్ కీలకమైంది. నిజం చెప్పాలంటే వెస్ట్ జోన్లో ప్రాజెక్ట్ చేయడం డెవలపర్లకు, సొంతిల్లు కొనడం కొనుగోలుదారులకూ స్టేటస్ సింబల్!
కూకట్‌పల్లితో ప్రారంభమయ్యే పశ్చిమ జోన్ .. శేరిలింగంపల్లి, పటా¯Œ చెరు వరకూ విస్తరించి ఉంటుంది. ఇందులో గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, గోపనపల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, మియాపూర్, మదీనాగూడ, చందానగర్ ప్రాంతాలు కీలకమైనవి. ఎందుకంటే ఐటీæ, ఐటీఈఎస్, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ విద్య, వైద్య సంస్థలతో పాటూ లగ్జరీ షాపింగ్ మాళ్లకు నిలయం మరి! వీటికి తోడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ట్రయల్ రన్ పరుగులు అదనపు ఆకర్షణలు.
400 గజాల నుంచి నిర్మాణాలు..
వెస్ట్ జోన్లో కేవలం లగ్జరీ విల్లాలు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, ఆకాశహర్మ్యాలు మాత్రమే కాదు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే చిన్న చిన్న అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. పశ్చిమ జోన్లో చ.అ. ధరలు రూ.3,500–8,000 వరకుంటాయి. కానీ, 90 శాతం మార్కెట్ రూ.4,500 లోపే ఉంటుందని ఓ డెవలపర్ తెలిపారు. ప్రస్తుతం ఈ జోన్లో 300–400 ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉంటాయని.. ఇందులో 400 గజాల నుంచి 5 ఎకరాల వరకు ప్రాజెక్ట్‌లుంటాయని పేర్కొన్నారు. ఏ తరహా ప్రాజెక్ట్‌లైనా సరే 70–80 శాతం కొనుగోళ్ల వాటా ఐటీ ఉద్యోగులది. ఆ తర్వాత ఫార్మా, ప్రభుత్వ ఉద్యోగులుంటారు.
ప్రతికూలంలోనూ అమ్మకాలు..
జీహెచ్ఎంసీ ఆదాయంలో 50–60 శాతం ఆదాయం ఒక్క వెస్ట్ జోన్ నుంచే వస్తుంది. ఇక్కడ ఐదంతస్తుల్లోపు నిర్మాణాలతో పాటూ ఆకాశహర్మ్యాలు, లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి. కార్యాలయాలకు, వినోద కేంద్రాలకు చేరువలో ఇళ్లు ఉండటంతో ప్రతికూల సమయంలోనూ పశ్చిమ జోన్లో అమ్మకాలు బాగుంటాయని చెప్పారు. ఏటా స్థలాల ధరలు, నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో చ.అ. ధరలు కూడా రూ.100–300 వరకు పెంచక తప్పని పరిస్థితి. మంచి నీళ్లు, విద్యుత్ సరఫరా, మెరుగైన రహదారులు వంటి వాటికైతే పశ్చిమ జోన్లో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. స్థానిక రాజకీయాంశం, ఆర్ధిక మాంద్యం, పెద్ద నోట్ల రద్దు వంటి పలు కారణాలతో గత కొంతకాలంగా మార్కెట్లో పెద్దగా కదలికలు లేకపోవడంతో ఇళ్ల ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. అయితే ఏమాత్రం సానుకూల వాతావరణం కనిపించినా ఒక్కసారిగా ధరలు పెరిగే అవకాశముంది. అందుకే సొంతింటి సాకారానికి ఇదే సరైన సమయమని చెప్పారు.
వెస్ట్ జోన్ స్టేటస్ సింబల్..
ప్రెస్టిజ్, అపర్ణా, మై హోమ్, రాంకీ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లన్నీ వెస్ట్ జోన్ కేంద్రంగానే ఉన్నాయి. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం సన్నద్ధమైంది. స్థానికులే కాదు వివిధ ప్రాంతాల వారూ నగరంతో పాటూ తామూ అభివృద్ధి చెందుతామనే నిర్ణయానికొచ్చారు. దీంతో నివాస సముదాయాలకు గిరాకీ పెరిగిందని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాజెక్ట్ వ్యయంలోని 40 శాతం పన్నుల రూపంలోనే చెల్లిస్తున్నాం. ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములయ్యే నిర్మాణ రంగాన్ని రకరకాల ఇబ్బందులతో అష్టదిగ్బంధనం చేయకూడదని సూచించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపి.. స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహిస్తే మరింత నాణ్యమైన ఇళ్లను అందించడంతో పాటూ సొంతింటి కలను తీరుస్తున్నామని పేర్కొన్నారు.