Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

సౌదీ కింగ్‌డమ్‌లో 4101 వ్యక్తిగత గృహాలు

అమెరికాకు చెందిన ప్రీఫ్యాబ్‌ స్టార్టప్‌ కాటెర్రా సౌదీ అరేబియాలోకి ఎంట్రీ ఇచ్చింది. సౌదీలో 4101 వ్యక్తిగత గృహాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సౌదీ అరేబియా గృహ మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మంత్రి మజీద్‌ బిన్‌ అబ్దుల్లా ఆల్‌ హోగిల్, సాఫ్ట్‌బ్యాంక్‌ ఎస్‌బీఐఏ పార్టనర్‌ అండ్‌ హెడ్‌ జియాద్‌ ఆల్‌ అషైక్, కాటెర్రా మిడిల్‌ ఈస్ట్‌ ప్రెసిడెంట్‌ అశ్‌ భరద్వాజ్‌ ఒప్పందాల మీద సంతకాలు చేశారు. మొత్తం 4101 ఇండిపెండెంట్‌ హౌజ్‌లకు గాను.. 2482 గృహాలు మక్కాలో, 1043 గృహాలు మదీనాలో, మిగిలిన గృహలు బాహా, జౌఫ్, ఖాసిం ప్రాంతాల్లో నిర్మించనున్నట్లు తెలిసింది. సౌదీ అరేబియా విజన్‌–2030లో భాగంగా ఈ నిర్మాణాలను చేపట్టనున్నామని.. ఆర్ధికంగా వెనకబడిన తరగతులకు, అర్హులైన లబ్ధిదారులకు ఈ గృహాలను కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది.
1000 నిపుణుల ఎంపిక..
2015లో మిచెల్‌ మార్క్స్‌ కాటెర్రాను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి 6 ఫ్యాక్టరీలున్నాయి. 700లకు పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. కాటెర్రాకు అమెరికా, ఇండియా, చైనా, మధ్య ప్రాచ్య దేశాల్లో కార్యాలయాలున్నాయి. సుమారు 5 వేల మంది ఉద్యోగులుంటారు. డిజైన్, ఫ్యాక్టరీ ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్, క్వాలిటీ కంట్రోల్, మానవ వనరులు, హెల్త్‌ అండ్‌ సేఫ్టీ, సప్లయి చైన్, మెయింటనెన్స్, ఐటీ అండ్‌ ఫైనాన్స్‌ విభాగాల్లో సుమారు 1000 మంది నిపుణులు తీసుకుంటామని కంపెనీ తెలిపింది.

Related Posts

Latest News Updates