Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

స్టూడెంట్స్‌కు నో టెన్షన్‌!

స్టూడెంట్‌ కో–లివింగ్‌ హౌజింగ్‌ కంపెనీ స్టాంజా లివింగ్‌ హైదరాబాద్‌లో మరింత విస్తరించింది. కూకట్‌పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో సుమారు 2 వేల స్టూడెంట్‌ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం స్టాంజాకు దేశంలోని 9 నగరాల్లో 22 వేల పడకలున్నాయి. 2021 నాటికి లక్ష బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యించినట్లు కంపెనీ కో–ఫౌండర్లు అనింధ్య దత్తా, సందీప్‌ దాల్మియా తెలిపారు.
సోషల్, స్ప్రింగ్‌బోర్డ్‌ సేవలు కూడా..
స్టాంజా సోషల్, స్ప్రింగ్‌ బోర్డ్‌ పేరిట ప్రత్యేక సేవలను కూడా అందిస్తుంది. స్టాంజా సోషల్‌లో.. మూవీ స్క్రీనింగ్, స్పోర్ట్స్‌ టోర్నమెంట్స్, మ్యూజికల్‌ నైట్స్, ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌ వంటివి ఏడాది పొడువునా అందిస్తుంది. స్టాంజా స్ప్రింగ్‌బోర్డ్‌లో.. అకడమిక్‌లో కాంప్లిమెంట్స్, ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్సామ్‌ వంటివి అందిస్తుంది.
తెలంగాణలో 70 వేల మంది విద్యార్థులు..
ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌హెచ్‌ఈ) నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో 470 ఇనిస్టిట్యూట్స్‌ ఉన్నాయి. దేశంలోనే మూడో అతిపెద్ద ఎడ్యుకేషన్‌ హబ్‌గా పేరొందింది. తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌లో సుమారు 70 వేల మంది విద్యార్థులుంటారు. హైదరాబాద్‌లో స్థానికులతో పాటూ దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులుంటారు. క్యాంపస్‌ వసతులు కొద్ది శాతం మంది మాత్రమే ఉంటాయి. దీంతో ప్రైవేట్‌ స్టూడెంట్‌ లివింగ్‌ కంపెనీలకు వ్యాపార అవకాశాలను కల్పిస్తుంది.

Related Posts

Latest News Updates