ఎన్సీఆర్కు చెందిన ఇన్వెస్మెంట్ అడ్వైజరీ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ షేర్వాటర్ వెంచర్స్ షేర్డ్ లివింగ్ స్పేస్ (స్టూడెంట్ హౌజింగ్) లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మై–నెస్ట్ బ్రాండ్ పేరుతో సేవలను అందిస్తుంది. ఈ కంపెనీని రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు రాజీవ్ ప్రమోటర్‌గా ఉన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.700 కోట్లు (80–100 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. సుమారు 10 వేల బెడ్స్ యువ నిపుణులు, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యించింది. తొలి విడతలో ఎన్సీఆర్లో ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తామని, ఆ తర్వాత బెంగళూరు, పుణె, హైదరాబాద్ నగరాలకు విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. వెయ్యి పడకలను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రైవేట్ ఈక్విటీ ద్వారా నిధులను సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. రాజీవ్ ఈ ఏడాది ప్రారంభంలో లండన్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్నున్న నైట్‌ఫ్రాంక్ ఇండియా నుంచి బయటికొచ్చిన విషయం తెలిసిందే.