Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హకీంపేట్‌లో ఆర్యవర్తనగరి

సుచిరిండియా గ్రూప్‌ హకీంపేట్‌ రోడ్‌లోని తూమ్‌కుంటలో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఆర్యవర్తనగరి పేరిట 86 ఎకరాలను అభివృద్ధి చేస్తుంది. 200 గజాల నుంచి 1,000 గజాల మధ్య మొత్తం 800 ఓపెన్‌ ప్లాట్లుంటాయి. ఆర్యవర్తనగరి ప్రత్యేకత ఏంటంటే.. ముఖ ద్వారం నుంచి మొదలుపెడితే ప్రాజెక్ట్‌లోని వసతులు, క్లబ్‌ హౌజ్, ఇతరత్రా ఏర్పాట్లు అన్నీ రాజుల కాలాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. అంటే భారీ ఏనుగు విగ్రహాలు, రాజుల చిత్ర పటాలు వంటివి ఏర్పాటు చేస్తాం. దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల సమ్మిళిత ఆర్కిటెక్చర్‌ ఉంటుంది.– ఘట్‌కేసర్‌ బోగారంలోని హోలీమేరీ కళాశాలను ఆనుకొని ఓయ్‌స్టర్‌ బ్లూ పేరిట 50 ఎకరాలను అభివృద్ధి చేస్తుంది. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌లో 166 గజాల నుంచి 7 వేల గజాల వరకు మొత్తం 600 ఓపెన్‌ ప్లాట్లుంటాయి.– ఘట్‌కేసర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అతి చేరువలోని యమ్నంపేటలో 7 ఎకరాల్లో ఒడిస్సీ విల్లా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తుంది. మొత్తం 99 డూప్లెక్స్‌ విల్లాలుంటాయి. ఒక్కో విల్లా 133 గజాల్లో 1,400 చ.అ. బిల్టప్‌ ఏరియాలో ఉంటుంది.టింబర్‌లీఫ్‌లో స్పానిష్‌ విల్లాలు..– బెంగళూరు జాతీయ రహదారిలో టింబర్‌లీఫ్‌ పేరిట మరో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 25 ఎకరాల్లో 123 విల్లాలుంటాయి. ఒక్కో విల్లా 330 గజాల్లో 3,800 బిల్టప్‌ ఏరియాలో ఉంటుంది. యూరోపియన్‌ స్టయిల్‌లో స్పానిష్‌ ఆర్కిటెక్చర్‌తో ఉండటమే వీటి ప్రత్యేకత. గేటెడ్‌ కమ్యూనిటీలా కాకుండా రిసార్ట్‌లో ఉన్న అనుభూతి కలిగేలా ప్రాజెక్ట్‌లో 101 రకాల వసతులను అభివృద్ధి చేస్తున్నాం. 70 వేల చ.అ.ల్లో క్లబ్‌ హౌజ్‌తో పాటూ స్విమ్మింగ్‌ పూల్, జిమ్, ఇండోర్‌ గేమ్స్, వాలీబాల్‌ కోర్ట్, వాక్‌ వే, జాగింగ్‌ ట్రాక్స్, గార్డెన్, అంపి థియేటర్‌ వంటివెన్నో ఉంటాయి.

Related Posts

Latest News Updates