Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హానర్‌ హోమ్స్‌ రూ.25 లక్షల విరాళం

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ హానర్‌ హోమ్స్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.25 లక్షలు విరాళంగా అందించింది. ఒక మంచి సదుద్ధేశంతో సమాజాభివృద్ధికి తమ వంతు సాహంగా ఈ సొమ్మును అందజేస్తున్నట్లు హానర్‌ హోమ్స్‌ డైరెక్టర్లు పి. వెంకటేశ్వర్లు, ఎం బాలు చౌదరి, స్వప్న కుమార్‌లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు సమక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌కు సంస్థ డైరెక్టర్లు చెక్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల, ఎన్‌ఆర్‌ఐ కో–ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల పాల్గొన్నారు. సామాజిక బాధ్యత నిర్వహణలో చొరవ తీసుకుంటున్నందుకు కేటీఆర్‌ హానర్‌ హోమ్స్‌ డైరెక్టర్లను అభినందించారు.

Related Posts

Latest News Updates