Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హీరా గోల్డ్‌ ఆస్తులకు జియో ట్యాగింగ్‌

తప్పుడు హామీలతో ఇన్వెస్టర్లు, కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్‌ ఆస్తులను ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్రలతో పాటూ ఢిల్లీ, హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో నౌహీరా, హీరా గ్రూప్‌కు 110 ఆస్తులున్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.400 కోట్లకు పైగానే ఉంటుంది.
కొనుగోలు చేయవద్దు..
ఆయా ప్రాపర్టీలను కొనుగోలు చేయవద్దని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు. ఆయా స్థలాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఆస్తులను జియో ట్యాగింగ్‌ చేశారు. ఈ స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దంటూ ఆయా రాష్ట్రాల స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగాలకు లేఖలను పంపించారు.

Related Posts

Latest News Updates