Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హెచ్‌ఎండీఏ పరిధిలో 713 అక్రమ లే–అవుట్లు

7000 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో 713 అక్రమ లే–అవుట్లు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో ఈ విషయాన్ని గుర్తించింది. ఘట్‌కేసర్‌ జోన్‌లో 245, శంకర్‌పల్లిలో 189, శంషాబాద్‌లో 129, మేడ్చల్‌లో 150 అనధికార లే అవుట్లు ఉన్నాయని గుర్తించింది. వెంటనే అక్రమ లే అవుట్లను అభివృద్ధి చేస్తున్న డెవలపర్లకు నోటీసులు అందించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.
ఫైనల్‌ లే–అవుట్‌ రాకుండానే..
హెచ్‌ఎండీఏ పరిధిలో వేలాది అక్రమ లే అవుట్లు ఉంటాయని ఎన్‌జీవో సభ్యుడు ఆరోపించారు. డెవలపర్లు హెచ్‌ఎండీఏ నుంచి ప్రాథమిక అనుమతి తీసుకొని, ఫైల్‌ నంబరు చూపించి క్రయవిక్రయాలు జరుపుతున్నారని తెలిపారు. ఫైనల్‌ లే అవుట్‌ పర్మిషన్‌ రాకుండానే ప్లాట్లను విక్రయిస్తున్నారని, దీంతో కొనుగోలుదారులు మోసపోతున్నారని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates