Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైటెక్‌ సిటీలో ప్రభుత్వ స్థలం కబ్జా

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జాదారులు కన్నేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కంచెలు నిర్మించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలం ఆక్రమణ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రెవిన్యూ అధికారులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు.
సర్వే నంబరు 11/1; 7.86 ఎకరాలు..
శేరిలింగంపల్లి మండలం సర్వే నంబరు 11/1లో 7.86 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. సైబర్‌ టవర్స్‌కు కూతవేటు దూరంలో కూకట్‌పల్లి జేఎన్‌టీయూకు వెళ్లే స్పైనల్‌ రోడ్డు పక్కనే ఉది ఈ స్థలం. దీన్ని విలువ మార్కెట్‌ రేటు ప్రకారం వంద కోట్లపైనే ఉంటుంది. జూన్‌ 1న ఈ ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే గది నిర్మించి, సున్నం వేశారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవిన్యూ అధికారులు జేసీబీలతో అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. తర్వాత మళ్లీ కొద్ది రోజులకే ఏకంగా స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కంచెను తొలగించేశారు.
ఇందిరమ్మ ఇళ్లకు కేటాయింపు..
ఈ ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇళ్లను నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీంతో అప్పటి హౌజింగ్‌ బోర్డ్‌ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలన సైతం చేశారు. తర్వాత ప్రభుత్వాలు మారడంతో ఈ స్థలం ఖాళీగా ఉండిపోయింది. 2015లో కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు ఈ స్థలం చుట్టూ ఇనుప కడ్డీలను ఏర్పాటు చేశారు. కొద్ది నెలల క్రితం ఇదే ప్రభుత్వ స్థలం తమకు ఇళ్లను కేటాయించాలని కొందరు వందల సంఖ్యలో మూకుమ్మడిగా గుడిశెలు వేశారు. దీంతో పోలీసులు సహకారంతో వీటిని తొలగించారు.

Related Posts

Latest News Updates