Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైదరాబాద్‌లో లక్షన్నర గృహాలు ఖాళీ, ఢిల్లీలో 3 లక్షలు, బెంగళూరులో 3 లక్షలు,

దేశంలోని పట్టణ ప్రాంతాల్లో మొత్తం అందుబాటులో ఉన్న గృహాల్లో 12 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయని జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధిక గృహాలు ఖాళీగా ఉన్న నగరం ముంబై. ఇక్కడ 4.8 లక్షల ఇళ్లు వేకెంట్‌గా ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీలో 3 లక్షలు, బెంగళూరులో 3 లక్షలు, హైదరాబాద్‌లో లక్షన్నర వరకూ గృహాలు వేకెంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 5 శాతం మంది అద్దెకుంటే, పట్టణ ప్రాంతాల్లో 31 శాతం మంది అద్దెకుంటున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక శాతం అద్దెకుంటున్నారు.అందుబాటు గృహాలు ఎందుకు అమ్ముడుపోలేదంటే?రెరా కంటే ముందు లోప భూయిష్టమైన ప్రాజెక్ట్‌లను గుర్తించడంతో కొనుగోలుదారులు వెనకపడ్డారు. కానీ, రెరా అమల్లోకి వచ్చాక కస్టమర్లు గుర్తించలేకపోయినా సరే రెరా అథారిటీ, బ్యాంక్‌లు గుర్తిస్తాయి. దీంతో రెరా అమలయ్యాక గృహాల ఇన్వెంటరీ పెరిగింది. ఇందుకు ప్రధాన కారణాలివే..మౌలిక వసతులు:అందుబాటు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు డెవలపర్లు స్థానిక ప్రజల అవసరాలు, గృహ విస్తీర్ణాలపై అధ్యయనం చేయలేదు. కేవలం భూమి తక్కువ ధరకు దొరుకుతుందని, అభివృద్ధి నిబంధనల ఖర్చు తగ్గుతుందనే కారణాలతో సుదూర ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లను నిర్మించారు. పని ప్రదేశాలకు, మెరుగైన మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో గృహాలను నిర్మించారు.నాసిరకం నిర్మాణాలు:చాలా వరకు అందుబాటు గృహాల డిజైన్, నాణ్యత అంశాల్లో నాసిరకం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. పాత కాలం నాటి డిజైన్లతో నిర్మాణాలుండటం కూడా అమ్మకాలకు అడ్డంకే. నిర్మాణంలో నాణ్యత లేకపోతే అందుబాటు గృహాలైనా, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా సరే ఏళ్లపాటు అమ్ముడుపోకుండా ఉంటాయి.లీగల్‌ సమస్యలు..చాలా వరకు అందుబాటు గృహా ప్రాజెక్ట్‌లు స్థానిక సంస్థల అనుమతులు లేకుండా ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాజెక్ట్‌ల్లో అయితే అనుమతి ఉన్న ఫ్లోర్స్‌ కంటే ఎక్కువ అంతస్తు నిర్మాణాలున్నాయి. దీంతో అందుబాటు గృహాలు విక్రయానికి నోచుకోవట్లేదు.ఖాళీగా ఉన్న గృహాలను అమ్ముడుపోవాలంటే?కేంద్ర ప్రభుత్వం నిజంగా 2022 నాటికి అందరికీ గృహాలను అందించాలనే లక్ష్యంతో ఉంటే గనక ముందుగా ఖాళీగా ఉన్న అందుబాటు గృహాలను ఆక్రమించేయాలి. అంటే ఇన్వెంటరీగా ఉన్న గృహాలను తగ్గించడం తప్ప ఇతర మార్గం లేదు. ఇందుకోసం ఏం చేయాలంటే?– నీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు వంటి మెరుగైన మౌలిక వసతులున్న చోటే గృహాలు అమ్ముడుపోతాయి. అందుకే ఎక్కడైతే విక్రయించబడకుండా ఉన్న గృహాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో వెంటనే మౌలిక వసతులను కల్పించాలి. దీంతో వెంటనే ఆయా ప్రాంతాల్లో గృహాలు అమ్ముడుకాకపోయినా మెల్లిగా కొనుగోలుదారులు ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు మొగ్గుచూపే అవకాశముంది.– చిన్న చిన్న అతిక్రమణలు జరిగిన అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కల్పించాలి. ఒకవేళ అందుబాటు గృహాలు నో డెవలప్‌మెంట్‌ జోన్‌ (ఎన్‌డీజెడ్‌) లేదా పర్యావరణ సున్నితమైన ప్రాంతాల్లో నిర్మించినట్లయితే స్థానిక మున్సిపల్‌ నిబంధనల్లో మార్పు చేసి ప్రత్యేక స్కీమ్‌లను తీసుకురావాలి. దీంతో ఆయా ప్రాంతాలు కూడా శరవగేంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు గతంలో ముంబైలో సాల్ట్‌ ప్లాన్‌ ల్యాండ్స్‌లో నిర్మాణాలకు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వటంతో పెద్ద ఎత్తున అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. 

Related Posts

Latest News Updates