Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైదరాబాద్‌లో అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ కోటి చ.అ.ల్లో ఆఫీస్‌ స్పేస్‌ ప్రాజెక్ట్‌

దివ్య శ్రీ డెవలపర్స్, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ) సంయుక్తంగా కలిసి మన దేశంలో 1.5 కోట్ల చ.అ.ల్లో పలు కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లను అభివృద్ది చేయాలని నిర్ణయించాయి. వచ్చే ఐదేళ్లలో దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఈ ప్రాజెక్ట్‌లను నిర్మించనున్నాయి. ఇప్పటికే ఏడీఐఏ అనుబంధ సంస్థ అయిన కొటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ (కేఐఏఎల్‌) మార్చి నెలలో 400 మిలియన్‌ డాలర్లతో ఇండియా ఆఫీస్‌ అసెట్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దివ్య శ్రీ డెవలపర్స్‌ డెవలప్‌మెంట్‌ పార్టనర్‌గా, ప్రాపర్టీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తుంది.
వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో కోటి చదరపు అడుగులు, పుణెలో 29 లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయాల ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దివ్య శ్రీ డెవలపర్స్‌కు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రాజెక్ట్‌లున్నాయి. ఏడీఐఏ పార్టనర్‌షిప్‌తో ముంబై, పుణె, ఎన్‌సీఆర్‌ వంటి వంటి ప్రధాన ప్రాంతాలకు విస్తరించినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది.

Related Posts

Latest News Updates