భాగ్యనగరి షాపింగ్ మాల్స్‌తో జిగేల్‌మననుంది. ప్రస్తుతమున్న మాల్స్‌కు అదనంగా మరో 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. 30 లక్షల చ.అ.ల్లో ఆయా మాల్స్ నిర్మాణంలో ఉన్నాయని 2020 నాటికి అందుబాటులోకి వస్తాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. దేశంలో 1.36 కోట్ల చ.అ.ల్లో అందుబాటులోకి రానున్న 34 మాల్స్లల్లో.. 11 హైదరాబాద్‌లోనే రానున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్కత్తా, ముంబై, పుణె నగరాల్లో 1.36 కోట్ల చ.అ.ల్లో మొత్తం 34 షాపింగ్ మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ రీజియన్‌లో 40 లక్షల చ.అ.ల్లో 8 మాల్స్, బెంగళూరులో 30 లక్షల చ.అ.ల్లో 6 మాల్స్ కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి. అహ్మదాబాద్‌లో మాత్రం ఒక్క మాల్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కాలేదు. స్థానిక రిటైల్ ప్రాంతాలే అహ్మదాబాద్‌లో హైస్ట్రీట్ మాల్గా ఉన్నాయి.
నయా మాల్స్ ఇవే..
మాదాపూర్, పంజగుట్ట, బేగంపేట, ఉప్పల్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ మాల్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ 16.88 లక్షల చ.అ.ల్లో నగరంలో 4 షాపింగ్ మాల్స్ అండ్ మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తోంది. ప్యాట్నీ సెంటర్లో 9 లక్షల చ.అ.ల్లో ప్యాట్నీ మాల్, ఆర్టీసీ క్రాస్ రోడ్ 4.75 లక్షల చ.అ.ల్లో ఓడియన్, 2.10 లక్షల చ.అ.ల్లో సుదర్శన్ మాల్ అండ్ మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తోంది. బేగంపేటలో 1.03 లక్షల చ.అ.ల్లో బ్లూ మూన్ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తోంది. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ మియాపూర్ క్రాస్ రోడ్లో 1.50 లక్షల చ.అ.ల్లో ఎస్ఎంఆర్ వినయ్ మాల్‌ను నిర్మిస్తోంది. డీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఉప్పల్‌లో భారీ షాపింగ్ మాల్‌ను నిర్మిస్తోంది.అపర్ణా కన్స్ట్రక్షన్స్ నల్లగండ్లలోని అపర్ణా సరోవర్ జెనిత్ ప్రాజెక్ట్ ప్రాంతంలో 3.5 లక్షల చ.అ. రిటైల్ మాల్‌ను నిర్మిస్తున్నాం. అపర్ణా నుంచి తొలి మాల్ ఇదే. గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాల లీజింగ్ పెరిగింది. కొత్త ఉద్యోగులు, వలసల కారణంగా నగర జనాభా కూడా పెరగనుంది. దీంతో భవిష్యత్తులో నగరంలో షాపింగ్ మాల్స్‌లకు గిరాకీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 79.59 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు..
విదేశీ, ప్రవాస భారతీయ పెట్టుబడిదారులు నివాస సముదాయాల్లో కంటే షాపింగ్ మాల్స్ రంగంలో పెట్టుబడులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. 2016 జనవరి నుంచి 2017 సెప్టెంబర్ నాటికి దేశీయ మాల్స్ విభాగంలో 79.59 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా హెడ్ అన్షుల్ జైన్ తెలిపారు. 2016 నుంచి ఏటా రిటైల్ రంగం 15 శాతం వృద్ధిని సాధిస్తోందని.. 2020 నాటికి దేశీయ రిటైల్ పరిశ్రమ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు.
మాల్స్లల్లో ఎక్స్పీరియన్స్ స్టోర్లు..
దేశీయ విపణిలోకి విదేశీ రిటైలర్స్ అడుగుపెడుతున్నారు. కొంత కాలంగా రిటైల్ స్పేస్ వృద్ధి చెందుతుండటంతో సంస్థాగత పెట్టుబడిదారులు ఈ రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్, రిటైల్ బ్రాండ్లు మాల్స్‌లో స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో మాల్స్‌లో ఆక్యుపెన్సీ స్థాయి పెరిగింది. ఇన్నాళ్లూ రిటైల్ కంపెనీలు, ఫ్యాషన్ స్టోర్లకు మాత్రమే పరిమితమైన షాపింగ్ మాల్స్‌లోకి ఇప్పుడు ఈ–కామర్స్ సంస్థలూ అడుగుపెట్టాయి. ఆన్‌లైన్‌తో పాటూ ఆఫ్లైన్లోనూ కస్టమర్లకు ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అందించడం కోసం ఎక్స్పీరియన్స్ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో షాపింగ్ మాల్స్ రంగం శరవేగంగా వృద్ది చెందుతోంది.