Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైదరాబాద్‌లో టేబుల్‌ స్పేస్‌ 9000 సీట్లు

బెంగళూరుకు చెందిన కో– వర్కింగ్‌ స్పేస్‌ కంపెనీ టేబుల్‌ స్పేస్‌ 2020 నాటికి హైదరాబాద్‌లో 6.5 లక్షల చదరపు అడుగుల్లో 9 వేల కో–వర్కింగ్‌ సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యించింది. ప్రస్తుతం నగరంలో 3 లక్షల చదరపు అడుగుల్లో 4 వేల ప్రీమియం ప్లగ్‌ అండ్‌ ప్లే స్పేస్‌ను నిర్వహిస్తుంది.
కస్టమర్లుగా ప్రముఖ కంపెనీలు..
నగరంలో 4 వేల సీట్లుండగా.. ఇందులో 2500 సీట్లు నిర్వహణలో ఉన్నాయని, మిగిలిన 1500 సీట్లు ఫిట్‌ఔట్‌గా ఉన్నాయని కంపెనీ తెలిపింది. 2020 తొలి త్రైమాసికం నాటికి నగరంలో మరొక 3.5 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. సేల్స్‌ఫోర్స్, మార్స్, ఎన్‌సీఆర్, మెర్క్, ఫుజిస్ట్యూ వంటి ప్రముఖ కంపెనీలు టేబుల్‌స్పేస్‌ కస్టమర్లుగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 15 వేల సీట్ల లక్ష్యం..
2020 నాటికి దేశవ్యాప్తంగా 11 లక్షల చదరపు అడుగులకు, 15 వేల సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని టేబుల్‌ స్పేస్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లో కలిపి 7.5 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ ఉంది. నగరాల వారీగా చూస్తే.. బెంగళూరులో 2.5 లక్షల చదరపు అడుగుల్లో 3 వేల సీట్లు, ముంబైలో 80 వేల చదరపు అడుగుల్లో 800 సీట్లు, పుణేలో 1.3 లక్షల చదరపు అడుగుల్లో 1700 సీట్లున్నాయి. గతేడాది టేబుల్‌ స్పేస్‌ ఆదాయం 110 కోట్లుగా కాగా.. 2019–20 ఆర్ధిక సంవత్సరంలో 300 కోట్ల ఆదాయాన్ని లక్ష్యించింది.

Related Posts

Latest News Updates