బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్‌లో మెగా హోమ్ ఫెస్ట్‌ను నిర్వహించనుంది. జులై 19, 20, 21 తేదీల్లో హైటెక్ సిటీలోని రాడిసన్ హోటల్లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందులో బెంగళూరు, మైసూరు, చెన్నై వంటి నగరాలకు చెందిన 25కి పైగా బ్రిగేడ్ గ్రూప్ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నామని కంపెనీ తెలిపింది. ధర రూ.27 లక్షల నుంచి రూ.4.29 కోట్ల వరకు గల ప్రాపర్టీలు ఈ ప్రాపర్టీ షోలో ఉంటాయి. అపార్ట్మెంట్స్, సీనియర్ లివింగ్, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్, టౌన్హౌజెస్, విల్లాలు వంటి అన్ని రకాల ప్రాపర్టీలు షోలో ఉంటాయి.