Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ కొత్త భవనం

హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ కొత్త భవనం శరవేగంగా ముస్తాబవుతోంది. 2021 నాటికి భవనంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశముంది. అందమైన భవనాల నిర్మాణంతో పాటు పచ్చదనంతో నిండిన పరిసరాలతో తమ కొత్త కార్యాలయ సముదాయం సిద్ధమవుతోందని హైదరాబాద్‌లో యూఎస్‌ కౌన్సల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా ట్వీట్‌ చేశారు. అద్భుతమైన భవనాల నిర్మాణాలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో పూర్తి పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారానికి తమ వంతు సహకారంగా.. కాన్సులేట్‌లో ప్రత్యేక నర్సరీని ఏర్పాటు చేసినట్టు, ఈ నర్సరీలో ఇప్పటికే మొక్కలు పెరిగాయని పేర్కొంటూ నిర్మితమవుతున్న భవనాలు, నర్సరీ ఫోటోలను కేథరిన్‌ ట్వీట్‌ చేశారు.
12.3 ఎకరాల్లో కాన్సులేట్‌..
నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 12.3 ఎకరాల్లో కొత్త యూఎస్‌ కాన్సులేట్‌ భవనం నిర్మితమవుతోంది. సుమారు వెయ్యి మంది అమెరికా, భారత కార్మికులు నిర్మాణ పనుల్లో ఉన్నారు.

Related Posts

Latest News Updates