Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హైదరాబాద్‌లో వీవర్క్‌ 3.80 లక్షల చ.అ. కో–వర్కింగ్‌ స్పేస్‌

న్యూయార్క్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న కో–వర్కింగ్‌ స్పేస్‌ కంపెనీ వీవర్క్‌.. హైదరాబాద్‌లో 3.80 లక్షల చదరపు అడుగుల్లో రెండు భారీ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. గచ్చిబౌలిలో 2.50 లక్షల చ.అ.ల్లో, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 1.75 లక్షల చ.అ. కో–వర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా ప్రాజెక్ట్‌ల ఒప్పందాలు చివరి దశలో ఉన్నాయని.. 2019 ముగింపు లోగా ఇవి అందుబాటులోకి వస్తాయని సమాచారం.
చెన్నై, పుణెలకు ఎంట్రీ..
ప్రస్తుతం వీవర్క్‌ ఇండియా విభాగానికి మన దేశంలో 30 లక్షల చ.అ. కో–వర్కింగ్‌ స్పేస్‌ ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 60 లక్షలకు చేర్చాలని లక్ష్యించింది. గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్‌ ఫోరమ్‌లో వీవర్క్‌కు అతిపెద్ద కో–వర్కింగ్‌ స్పేస్‌ను నిర్వహిస్తుంది. ఇందులో 2.15 లక్షల చ.అ.ల్లో 3202 డెస్క్‌లున్నాయి. త్వరలోనే చెన్నై, పుణే నగరాలకు విస్తరించనుంది.
వీవర్క్‌ ఇండియా 2016లో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 2017లో బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌తో జాయింట్‌ వెంచర్‌తో ఆపరేషన్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ముంబై, బెంగళూరులో 8 సెంటర్లు, గుర్గావ్‌లో 5 సెంటర్లున్నాయి. 21 ప్రాంతాల్లో 35 వేల డెస్క్‌లున్నాయి.

Related Posts

Latest News Updates