Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైదరాబాద్‌లో వేర్‌హౌజ్‌ హవా

హైదరాబాద్‌లో గిడ్డంగుల మార్కెట్లో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ స్థలాల లభ్యత ఎక్కువగా ఉండటం, అందుబాటులో ధరలు, అద్దెలూ తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాలతో ప్రయాణ అనుసంధానం మెరుగ్గా ఉండటం, తెలంగాణ ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు వంటివి కంపెనీలను నగరంలో గిడ్డంగుల ఏర్పాటుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఐకియా వంటి కంపెనీలు నగరంలో వేర్‌హౌజ్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి కూడా. – మరోవైపు ఫార్మా, బయోటెక్నాలజీ కంపెనీలకు హబ్‌గా మారింది నగరం. నోవార్టిస్, డాక్టర్‌ రెడ్డీస్, శాంతా బయోటెక్, జీఎస్‌కే కన్జూమర్, మైలాన్‌ వంటి కంపెనీలున్నాయిక్కడ. వీటికి సమాతరంగా తయారీ, ఈ–కామర్స్‌ రంగాలూ ప్రవేశించడంతో నగరంలో వేర్‌హౌజ్‌ మార్కెట్‌కు డిమాండ్‌ పెరిగింది.జీడిమెట్ల, మేడ్చల్, పటాన్‌చెరు, శంషాబాద్‌ ప్రాంతాలు గిడ్డంగుల మార్కెట్‌కు ప్రధాన కేంద్రంగా మారాయి. ఎందుకంటే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌–44, కరీంనగర్‌ హైవేకు సులువుగా వెళ్లవచ్చు. అలాగే ఇక్కడ స్థలం అందుబాటూ ఎక్కువే.
– ప్రస్తుతం హైదరాబాద్‌లో 1–1.5 కోట్ల చ.అ.ల్లో గిడ్డంగుల స్థలం అందుబాటులో ఉంది. ఏటా 70 లక్షల చ.అ.లకు పైగా స్థల లావాదేవీలు జరుగుతున్నాయి. 2020 నాటికి 6.1 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం అవసరం ఉంది. ఇందులో తయారీ రంగానికి 4.2 కోట్ల చ.అ., రిటైల్‌ విభాగానికి 1.9 కోట్ల చ.అ.లు అవసరం ఉంది.– విభాగాల వారీగా స్థల అవసరాలను చూస్తే.. తయారీ రంగంలో కెమికల్స్‌ అండ్‌ ఫార్మా విభాగానికి 1.4 కోట్ల చ.అ., సిమెంట్‌ విభాగానికి 1.1 కోట్ల చ.అ., మెటల్స్‌ విభాగానికి 40 లక్షల చ.అ., టెక్స్‌టైల్స్‌కు 20 లక్షల చ.అ., ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు 90 లక్షల చ.అ., ఇంజనీరింగ్‌కు 20 లక్షల చ.అ.,  అవసరం ఉంది. రిటైల్‌ రంగంలో చూస్తే.. అపెరల్స్‌ అండ్‌ ఫుట్‌వేర్‌కు 60 లక్షల చ.అ., నిత్యావసరాలకు 30 లక్షల చ.అ., ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, హోమ్‌ అండ్‌ లైఫ్‌ స్టయిల్, జువెల్లరీ యాక్ససరీస్, ఎలక్ట్రానిక్స్, ఇతరత్రా వాటికి ఒక్కో విభాగానికి 20 లక్షల చ.అ., స్థలం అవసరముంది.నగరంలో ప్రధాన గిడ్డంగుల ప్రాంతాలు:– జీడిమెట్ల, గుండ్లపోచంపల్లి, బౌరంపేట్, గాజులరామారం, బొల్లారం, బాచుపల్లి, మేడ్చల్, తుర్కపల్లి.– అద్దె ధరలు నెలకు చ.అ.కు రూ.10–14 మధ్య ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎకరానికి 15–35 మిలియన్లు ఉంది.

Related Posts

Latest News Updates