హాంగ్‌కాంగ్‌కు చెందిన షాంగ్రీ–లా హోటల్స్ అండ్ రిసార్ట్స్ మన దేశంలో మరొక 5 హోటల్స్‌ను ఏర్పాటు చేయనుంది. స్థల సమీకరణ కోసం హైదరాబాద్‌తో పాటూ ముంబై, గోవా, కోల్‌కతా నగరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 2024 నాటికి ఈ హోటల్స్‌ను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలను వేగవంతం చేసింది. ప్రస్తుతం షాంగ్రీ–లాకు ఢిల్లీ, బెంగళూరులో రెండు హోటల్స్ ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 102 హోటల్స్..
ప్రపంచవ్యాప్తంగా షాంగ్రీ–లాకు 102 హోటల్స్ ఉన్నాయి. వీటిల్లో 18 శాతం రిసార్ట్స్. గోవా రిసార్ట్ ఏర్పాటకు సరైన ప్రాంతమని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మిడిల్ ఈస్ట్, ఇండియా, ఇండియన్ ఓషియన్) జాన్ నార్త్నెన్ తెలిపారు.