Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కూల్చివేత?

హైదరాబాద్‌లో 519 భవనాలు శిధిల స్థాయికి చేరుకున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో వీటిల్లో నివాసముండే ప్రజలు, స్థానిక నివాసితులు, ప్రయాణికులకు మృత్యు భవనాలుగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయా భవనాలను కూల్చివేత లేదా పునరుద్ధరణ చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ జాబితాలో జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోనల్‌ కార్యాలయం, హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కూడా ఉన్నాయి.
పాత ప్రహారీ గోడలు కూడా..
519 శిధిల భవనాల్లో గోషామహల్‌లో 151, బేగంపేట్‌లో 104, మలక్‌పేట్‌లో 31 భవనాలున్నాయని సిటీ ప్లానర్స్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల సంయుక్త బృందం గుర్తించింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ 761 శిధిల భవనాలను గుర్తించగా.. వీటిల్లో 130 నిర్మాణాలను ధ్వంసం చేసింది కూడా. 112 భవనాలు పునరుద్ధరణలో ఉన్నాయి. పాత భవనాలతో పాటూ పాత ప్రహారీ గోడలను కూడా గుర్తించామని తెలిపారు.
రాజకీయ జోక్యం..
గుర్తించిన శిధిల భవనాల యజమానులకు ముందుగా నోటీసులు జారీ చేశామని, రెండో విడతలో కూల్చివేతలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. హెచ్‌ఎంసీ కూల్చివేతకు వెళ్లినప్పుడు ఇళ్లను ఖాళీ చేయకపోవటం, రాజకీయ జోక్యం, కోర్టుకు వెళ్లడం తదితర కారణాల వల్ల శిధిల భవనాల కూల్చివేతలు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.

Related Posts

Latest News Updates