Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హైదరాబాద్‌ గిడ్డంగులు @ 40 లక్షల చ.అ.

హైదరాబాద్‌ వేర్‌ హౌజ్‌ డిమాండ్‌కు ప్రధాన కారణం ఈ–కామర్స్‌ రంగమే. 2017లో నగరంలో 20 లక్షల చ.అ. వేర్‌ హౌజ్‌ లావాదేవీలు జరగగా.. 2018లో హైదరాబాద్‌ నాటికి వంద శాతం వృద్ధితో 40 లక్షలకు చేరింది. మొత్తం లీజు/కొనుగోళ్ల లావాదేవీల్లో ఈ–కామర్స్‌ విభాగం వాటా 40 శాతం వరకుందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెనీ నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది.
ప్రధాన ప్రాంతాలివే..
హైదరాబాద్‌ వేర్‌ హౌజ్‌ లావాదేవీల్లో 70 శాతం జీడిమెట్ల – మేడ్చల్‌– కొంపల్లి క్లస్టర్‌ కేంద్రంగానే జరిగాయని పేర్కొంది. జీడిమెట్ల, శంషాబాద్, పటాన్‌చెరు మూడు క్టస్లర్లున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, కొంపల్లి, బౌరంపేట, గాజులరామారం, మేడ్చల్, తుర్కపల్లి, పటాన్‌చెరు, తూప్రాన్, పొద్దురు, ముత్తంగి, బొల్లారం, ఏదులనాగులపల్లి, శంషాబాద్, కొత్తూర్, తుక్కుగూడ, పాశమైలారం ప్రాంతాలు ప్రధాన వేర్‌హౌజ్‌ ప్రాంతాలు.
జీడీపీలో వేర్‌ హౌజ్‌ వాటా 13–14 శాతం..
2017లో దేశీయ వేర్‌ హౌజ్‌ పరిశ్రమలో మొత్తం 2.61 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగగా.. 2018 నాటికి 77 శాతం వృద్ధితో 4.62 కోట్ల చ.అ.లకు పెరిగింది. 2019లో దేశీయ వేర్‌ హౌజ్‌ విభాగంలో 73.9 కోట్ల చ.అ. లావాదేవీలు, 2024 నాటికి 92.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని నైట్‌ఫ్రాంక్‌ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో లాజిస్టిక్‌ వాటా 13–14 శాతం వరకుంటుందని, అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 8–10 శాతం వరకుంటుందని తెలిపింది.
కొత్త ప్రాంతాల్లోనే పెట్టుబడులు..
2014 నుంచి దేశీయ వేర్‌ హౌజ్‌ పరిశ్రమలోకి 6.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులొచ్చాయి. ఒక్కో డీల్‌ కనిష్టంగా 282 మిలియన్‌ డాలర్లు. వేర్‌ హౌజ్‌ పరిశ్రమలోకి ఎక్కువ పెట్టుబడులు ప్రైవేట్‌ ఈక్విటీదే హవా. 49 శాతం పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాగా.. సావరిన్‌ ఫండ్స్‌ 31 శాతం, పెన్షన్‌ ఫండ్స్‌ 20 శాతం వాటా ఉన్నాయి. ఇందులోనూ 83 శాతం ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొత్త డెవలప్‌మెంట్‌ ప్రాంతాల్లో రాగా.. 10 శాతం సిద్ధంగా ఉన్న వేర్‌ హౌజ్‌లోకి, 7 శాతం నిర్మాణంలో ఉన్న వేర్‌ హౌజ్‌ విభాగంలోకి వచ్చాయి.

Related Posts

Latest News Updates