హైదరాబాద్ రియల్టీ రంగం టాప్‌గేర్‌లో పడింది. బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి ఇతర మెట్రో నగరాల్లోని గృహాల అమ్మకాల్లో కనిపించని వృద్ధి భాగ్యనగరంలోనే జరిగింది. 2018–19 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో నగరంలో 7059 గృహాలు అమ్ముడయ్యాయి. 2017–18 క్యూ4తో పోలిస్తే 26 శాతం వృద్ధి. 2018 క్యూ4లో 5618 గృహాలు విక్రయమయ్యాయి. ఇక, కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్లను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 6285 యూనిట్లు ప్రారంభం కాగా.. 2019 క్యూ4లో 3 శాతం క్షీణించి 6066లకు తగ్గాయి. ఇన్వెంటరీలను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 42270 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. 2019 క్యూ4 నాటికి 35148 యూనిట్లకు తగ్గాయి. అంటే ఏడాదిలో 17 శాతం తగ్గిందన్నమాట. అద్దెల విషయంలోనూ అంతే! హైదరాబాద్‌లో మినహా అన్ని నగరాల్లో ఏడాదిలో అద్దెలు 14 శాతం పెరిగాయి.