Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హోమ్‌లేన్‌ రూ.300 కోట్ల ప్రణాళిక

ఇంటీరియర్‌ డిజైన్‌ స్టార్టప్‌ హోమ్‌లేన్‌ 2019–20 ఆర్ధిక సంవత్సరంలో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో 2 వేల గృహాలను ఇంటీరియర్స్‌ పూర్తి చేశామని, 2020 ఆర్ధికంలో సుమారు 6 వేల గృహాలను లక్ష్యించామని కంపెనీ సీఈఓ అండ్‌ కో–ఫౌండర్‌ శ్రీకాంత్‌ అయ్యర్‌ తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో మా ఆదాయం మూడు రెట్లు వృద్ధి చెందిందని, ఈ ఆర్ధికంలోనూ ఇదే వృద్ధిని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
రెనోవేషన్‌ విభాగంలోకి ఎంట్రీ..
ప్రతి నెలా 15 శాతం ఆదాయం వృద్ధి అవుతుంది. ప్రతి రోజూ 10 గృహలను డెలివరీ చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రెనోవేషన్‌ గృహ విభాగంలోకి ఎంట్రీ ఇస్తామని శ్రీకాంత్‌ తెలిపారు. ప్రస్తుతం హోమ్‌లేన్‌ హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, కోల్‌కత్తాలో సేవలందిస్తుంది. ప్రస్తుత ఆయా నగరాల్లో 10 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లున్నాయి. 2020 మార్చి నాటికి మరొక 15 సెంటర్ల జత చేయాలని కంపెనీ లక్ష్యించింది.

Related Posts

Latest News Updates