Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హోమ్‌లేన్‌ 2వ ఇంటీరియర్‌ సెంటర్‌

ప్రముఖ ఇంటీరియర్‌ డిజైన్‌ బ్రాండ్‌ హోమ్‌లేన్‌ హైదరాబాద్‌ రెండవ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. టెక్నాలజీ అనుసంధానిత ఈ సెంటర్‌లో పర్సనలైజ్‌ ఇంటీరియర్‌ సేవలందిస్తామని కంపెనీ ఫౌండర్‌ అండ్‌ సీఈవో శ్రీకాంత్‌ అయ్యర్‌ తెలిపారు. నగరంలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, అందుకే విస్తరణ చేశామని పేర్కొన్నారు. 2019లో ఇప్పటివరకు 27 వేల గృహాలకు ఇంటీరియర్‌ డిజైన్స్‌ అందించామని తెలిపారు. గత నాలుగేళ్లుగా 4,500 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది.

Related Posts

Latest News Updates