భారత రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద డీల్. వేర్ హౌజ్ విభాగంలో అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) డీల్ జరిగింది. అమెరికాకు చెందిన ఆస్తుల నిర్వహణ బహుళ జాతి కంపెనీ బ్లాక్‌స్టోన్.. సింగపూర్‌కు చెందిన జీఎల్పీ వేర్ హౌజ్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.1,29,000 కోట్లు (18.7 బిలియన్ డాలర్లు). మొత్తం డీల్‌లో బ్లాక్‌స్టోన్ రియల్ ఎస్టేట్ గ్లోబల్ ఆపార్చునిస్టిక్ బీఆర్ఈపీ స్ట్రాటర్జీ 13.4 బిలియన్ డాలర్లకు 115 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని, బ్లాక్‌స్టోన్ రియల్ ఎస్టేట్ ఇన్‌కం ట్రస్ట్ 5.3 బిలియన్ డాలర్లకు నాన్ లిస్టెడ్ రీట్ 64 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం బ్లాక్‌స్టోన్‌కు 17.9 కోట్ల అడుగుల అర్బన్ లాజిస్టిక్ అసెట్స్ లావాదేవీలున్నాయి. జీఎల్పీకి అమెజాన్.కామ్, జేడీ.కామ్, అడిడాస్ ఏజీ, లోరియాల్ ఎస్ఏ వంటి దిగ్గజ కంపెనీలు దీని క్లయింట్స్‌గా ఉన్నాయి.