Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

16 నుంచి టీ 20 ప్రపంచకప్

ఆస్ట్రేలియా గడ్డపై టీ 20 ప్రపంచకప్ అక్టోబర్ 16వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్లను వీక్షించేందుకు రానున్నారు. ఇప్పటికే 6 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాయి. మిగతా దేశాలు చేరుకుంటున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్లతో ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ వేడి రాజుకుంది.

ఈ నెల 16 నుంచి తొలి రౌండ్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. సూపర్ 12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఈ నెల 22 నుంచి సూపర్ 12 సమరం మొదలవుతుంది. సూపర్ 12లో ప్రధాన జట్లు పోటీపడతాయి. సూపర్ 12లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. టీ 20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఏడు నగరాలు వేదికలుగా ఉన్నాయి. సూపర్ -12లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. సిడ్నీ గ్రౌండ్లో ఈ మ్యాచ్ ఉంటుంది. సూపర్ 12 మ్యాచ్ల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులను చూసేందుకు తాము వెంపర్లాడుతున్నామని ఐసీసీ టి 20 ప్రపంచకప్ చీఫ్ మిచెల్ ఎన్రైట్ అన్నారు. ప్రతీ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు రిలీజ్ చేయగానే అమ్ముడుపోతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Related Posts

Latest News Updates