దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2020 ముగింపు నాటికి 2.75 లక్షల ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధమవుతాయి. వీటిల్లో సుమారు 13.1 లక్షల యూనిట్లు 2014–19 మధ్య కాలంలో ప్రారంభించినవేనని అనరాక్ ప్రాపర్టీ నివేదిక తెలిపింది. సుమారు 1.13 లక్షల గృహాలు రూ.40 లక్షల లోపు ధర ఉండే అఫడబుల్ హౌస్లేనని నివేదిక పేర్కొంది. రూ.40–80 లక్షల ధర ఉండే మధ్య స్థాయి గృహాలు 90,770, రూ.80 లక్షల నుంచి 1.5 కోట్ల మధ్య ధర ఉండేవి 44,000 గృహాలు, 27,500 అల్ట్రా లగ్జరీ గృహాలుంటాయి. వచ్చే ఏడాది ముగింపు నాటికి హైదరాబాద్లో 6,670 బడ్జెట్ గృహాలు, 5,470 మధ్యస్థాయి గృహాలు, 3,250 అల్ట్రా లగ్జరీ గృహాలు సిద్ధమవుతాయి.