Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

2019 తొలి త్రైమాసికంలో.. హైదరాబాద్‌లో 3026 గృహాల ప్రారంభం

2019 తొలి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో కొత్తగా 42504 గృహాల ప్రారంభమయ్యాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 3 శాతం వృద్ధి అని ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. నగరాల వారీగా చూస్తే.. హైదరాబాద్‌లో 3,026 గృహాలు ప్రారంభమయ్యాయని, ఇదే టాప్‌లో ఉందని తెలిపింది. ఆ తర్వాత నోయిడా, థానే నగరాలు నిలిచాయి.
క్యాపిటల్‌ వృద్ధిలోనూ నగరమే..
హైదరాబాద్‌ మినహా గుర్గావ్, నోయిడా, ముంబై, కోల్‌కతా, పుణే, బెంగళూరు, థానే, చెన్నై నగరాల్లో క్యాపిటల్‌ విలువలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 4 శాతం తగ్గాయి. గత బడ్జెట్‌లో కేంద్రం అందుబాటు గృహలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం వల్లే గృహాలకు డిమాండ్‌ పెరిగిందని తెలిపింది. గత కొన్నేళ్లుగా నివాస విభాగ మార్కెట్‌ నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. గడువులోగా ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమయ్యారు. దీంతో సప్లయి పెరిగిపోయింది. కార్మికులు, నిర్మాణ వ్యయం పెరగడం కూడా ఒకింత భారంగా మారింది.

Related Posts

Latest News Updates