Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

2021 నుంచి హైదరాబాద్‌ లులూ మాల్‌!

ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్‌ మాల్‌.. లులూ! హైదరాబాద్‌లో శరవేగంగా ముస్తాబవుతోంది. 2021 మే నాటికి ఈ మాల్‌ అందుబాటులోకి రానుంది. హైటెక్‌సిటీ సమీపంలోని ఖానామెట్‌లో 10 లక్షల చదరపు అడుగుల్లో లులూ మాల్‌ను నిర్మిస్తున్నారు. ఈ భవనం 3 బేస్‌మెంట్స్‌+గ్రౌండ్‌ ఫ్లోర్‌ + 3 అంతస్తుల్లో ఉంటుంది. 2 వేల కార్ల పార్కింగ్‌ స్పేస్, 2 లక్షల చదరపు అడుగుల్లో హైపర్‌ మార్కెట్, ఒకేసారి 1,540 మంది కూర్చొని భోజనం చేసే అతిపెద్ద ఫుడ్‌ కోర్టు, 15 స్క్రీన్ల మల్టిప్లెక్స్, డైన్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఏటీఎం, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్, కిడ్స్‌ ప్లే జోన్స్‌ వంటివెన్నో ఉంటాయి.
లులూ మాల్‌ క్రియేటర్‌ అరబిందో ఫార్మా
అబుదాబీ ప్రధాన కేంద్రంగా ఉన్న లులూ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌కు చెందినవే లులూ మాల్స్‌. దీన్ని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నది ఇండియాలో రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీ అరబిందో అనుబంధ సంస్థ అయిన అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌. ఈ కంపెనీ వచ్చే 3–5 ఏళ్లలో హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో 1.4 కోట్ల చదరపు అడుగుల్లో కమర్షియల్, రిటైల్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్‌లు నిర్మించాలని లక్ష్యించింది.


గెలాక్సీ, ఆర్బిట్‌ ప్రాజెక్ట్‌లు కూడా..
లులూ మాల్‌ కాకుండా ప్రస్తుతం అరబిందో రియల్టీ హైదరాబాద్‌లో 2 వాణిజ్య సముదాయాలను నిర్మిస్తుంది. దేశంలోని అత్యంత ఎల్తైన ప్రీ–కాస్ట్‌ భవనాలు కావటం వీటి ప్రత్యేకత. మాదాపూర్‌లోని ఐకియా స్టోర్‌కు సమీపంలో 19 లక్షల చదరపు అడుగుల్లో ‘గెలాక్సీ’, 11 లక్షల చదరపు అడుగుల్లో ‘ఆర్బిట్‌’ కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంది. 25 అంతస్తుల్లోని ఈ ప్రాజెక్ట్‌ల ఎత్తు 105 మీటర్లు. 2020 మే నాటికి గెలాక్సీ, 2021 నాటికి ఆర్బిట్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తవుతుందని కంపెనీ తెలిపింది.
700 కోట్లతో తెలంగాణలో స్థలాల కొనుగోలు..
ప్రీ–కాస్ట్‌ ఉత్పత్తుల కోసం అరబిందో రియల్టీ ఏకంగా సొంతంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మెదక్‌–నర్సాపూర్‌ రోడ్డులో రూ.100 కోట్ల పెట్టుబడులో ప్లాంట్‌ పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్లాంట్‌ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 25 లక్షల చదరపు అడుగుల ప్రీ–కాస్ట్‌ శ్లాబ్స్‌. తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ఐఐసీ) నిర్వహించిన పలు వేలం పాటల్లో అరబిందో రియల్టీ రూ.700 కోట్ల పెట్టుబడులతో పలు స్థలాలను కొనుగోలు చేసింది.

450 మంది ఉద్యోగులు..
మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ ఆఫైర్స్‌ (ఎంసీఏ) వెబ్‌సైట్‌ డేటా ప్రకారం.. అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 2016 ఆగస్టులో ప్రారంభమైంది. ఇందులో పెనాకా సునీలా రాణి, రోహిత్‌ రెడ్డి పెనాకా, సంపత్‌ కుమార్‌ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రస్తుతం సీఈవోగా రవీంద్ర కుమార్‌ వీజే ఉన్నారు. ఈయన గతంలో లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) మాజీ ఉద్యోగి. ప్రస్తుతం అరబిందో రియల్టీలో ప్రస్తుతం 450 మంది ఉద్యోగులున్నారు.

Related Posts

Latest News Updates