నచ్చిన ప్రాంతంలో ఇల్లు కొనడమే కాదు.. ఇంట్లో ప్రతి గదిని, గదిలోని గోడలను నచ్చినట్లుగా ఇంటీరియర్ చేయించుకోవటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఇంట్లోని గోడలపై త్రీడీ వాల్ పేపర్స్ పెట్టుకోవటం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ఇంట్లోని గోడలపై, కిటికీలకు బ్లిడ్స్, ఇంటీరియర్స్ డిజైన్లు ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ ప్రత్యేకత చాటుతోంది వాల్ డికాస్ సంస్థ.
లక్ష డిజైన్స్..
ఇంట్లోని హాల్, బెడ్రూంల గదుల గోడలపై కావలసిన డిజైన్లతో పోస్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. త్రీడీ పోస్టర్ల ఏర్పాటుతో పెయింట్ వాసన కూడా రాదు. సుమారు 1 లక్ష డిజైన్లు ఈ వాల్ డికాస్లో ఉన్నాయి. ఆర్డర్లపై కావలసిన వాల్ పోస్టర్లు అందిస్తారు. గోడలపై ఫ్యామిలీ, చిన్నారుల ఫోటోల పోస్టర్లు లభిస్తాయి. 50 చదరపు అడుగుల నుంచి 300 చదరపు అడుగుల వరకు పోస్టర్‌ను అందిస్తారు. కనీసం 60 చదరపు అడుగుల రోల్స్ ఉంటాయి. రోల్ ప్రకారం బిల్లు ఉంటుంది.