Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

45 రోజుల్లో రెండస్తుల భవనం

సంప్రదాయ ఇళ్లకు కాలం చెల్లింది. సాంకేతికత రంగ ప్రవేశం చేశాక.. పునాదుల నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకూ ప్రతి ఒక్కటీ మారింది. వేగంతో పాటూ నాణ్యత, వ్యయం తగ్గుతుండటంతో నిర్మాణ సంస్థలు కూడా స్మార్ట్‌ హోమ్స్‌ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయ రియల్టీ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. వినూత్న డిజైన్స్, నిర్మాణ సామగ్రి ఎంపికలో స్థిరత్వం, ఖచ్చితత్వం, ఆన్‌లైన్‌ మార్కెటింగ్, నిర్మాణ వ్యర్థాల విడుదల, కార్మికుల వినియోగం, నిర్మాణ వ్యయం తగ్గుదల.. వంటి వాటి కోసం ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రియల్టీ మార్కెట్లో త్రీడీ ప్రింటింగ్, బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడ్లింగ్‌ (బీఐఎం), వర్చువల్‌/ ఆగ్యుమేటెడ్‌ రియాలిటీ (వీఆర్‌), డ్రోన్స్, రోబో టెక్నాలజీలు వంటివి కీలకంగా మారాయి.త్రీడీతో 45 రోజుల్లో రెండస్తుల భవనం..ప్రస్తుతం దేశీయ రియల్టీ పరిశ్రమలో త్రీడీ ప్రింటింగ్‌ పునాదుల దశలోనే ఉందని.. దశాబ్ధ కాలంలో ఇది భవనం స్థాయికి విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. త్రీడీ టెక్నాలజీతో నిర్మాణ వ్యర్థాల విడుదల, కార్మికుల వినియోగం, నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పెద్ద నిర్మాణ యంత్రాలను ఏర్పాటు చేసే వీలులేని ప్రాంతాల్లో త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా సులువుగా నిర్మాణాలను చేపట్టవచ్చు. గోడలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్‌ వ్యవస్థ వంటి వాటిల్లోనూ త్రీడీ ప్రింటింగ్‌ను వినియోగించుకునే వీలుంటుంది. అయితే ప్రస్తుతం త్రీడీ ప్రింటింగ్‌ యంత్రాలు చిన్న భవనాలకు మాత్రమే పరిమితమయ్యాయి. బహుళ అంతస్తులు, పెద్ద పెద్ద కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణ త్రీడీ యంత్రాల అవసరముంది. నివాస, వాణిజ్య, రిటైల్‌ విభాగంలో త్రీడీ ప్రింటింగ్‌ విస్తరించే అవకాశముంది. త్రీడీ టెక్నాలజీ వినియోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. నిర్మాణ రంగ త్రీడీ ప్రింటింగ్‌ యంత్రాల ధర సుమారు 2 లక్షల డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.14.73 కోట్లు. ప్రస్తుతం త్రీడీ ప్రింటింగ్‌ యంత్రాల నిర్మాణ సామర్థ్యం 33 అడుగులు (10 మీటర్లు) ఎత్తు, గంటకు 250 కిలోల కంటే తక్కువ. ఇటీవలే బీజింగ్‌లో జస్ట్‌ 45 రోజుల్లోనే రెండతస్తుల భవనాన్ని త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మించారు.ఎన్‌ఎంఆర్సీ నిర్మాణం బీఐఎంతోనే..త్రీడీ మోకప్స్, నిర్మాణ నమూనా డిజైన్ల అభివృద్ధి కోసం బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడ్లింగ్‌ (బీఐఎం) టెక్నాలజీని వినియోగిస్తుంటారు. కొన్ని నిర్మాణ సంస్థలు బీఎంఐ మీద కార్మికులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ శిబిరాలను, నిపుణుల నియమించుకుంటున్నాయి. నాగ్‌పూర్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎంఆర్సీ) ప్రాజెక్ట్‌లో ప్రతి దశలోనూ 5డీ బీఐఎం టెక్నాలజీ వినియోగించారు.  అమృత్‌సర్‌లో రాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌లో 4 కి.మీ. దూరాన్ని వర్చువల్‌ డిజైన్‌తో నిర్మించారు.

Related Posts

Latest News Updates