హైదరాబాద్ శివారు ప్రాంతంలోని 47.39 ఎకరాల భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) అటాచ్మెంట్ చేసింది. ముంబైకి చెందిన పరేఖ్ అల్యూమినిక్స్కు చెందిన ఈ భూమి ప్రభుత్వ విలువ ప్రకారం రూ.46.97 కోట్లు కాగా.. మార్కెట్ విలువ ప్రకారం వందల కోట్లు ఉంటుంది. బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రూ.2,297 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టినందుకే ఈడీ అటాచ్మెంట్ చేసినట్లు తెలిసింది.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు..
పరేఖ్ అల్యూమీనిక్స్ లిమిటెడ్ అల్యూమీనియం ఫాయిల్ కంటైనర్లు, ఫాయిల్ రోల్స్లను తయారీ, ఎగుమతి చేస్తుంది. కంపెనీ డైరెక్టర్ దీపక్ పరేఖ్ తయారీ యూనిట్ల అవసరం నిమిత్తం ఇండియన్ ఓవర్సీస్, దేనా, ఫెడరల్, యాక్సిస్ వంటి 20 బ్యాంక్‌ల కన్సార్టియం నుంచి 2,297 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. కానీ, ఈ రుణ మొత్తాన్ని తయారీ కోసం కాకుండా వ్యక్తిగత, ఇతర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల కోసం వినియోగించారని బ్యాంక్‌ల కన్సార్టియం ఆరోపించింది. దీంతో బుధవారం ముంబైలోని పరేఖ్ అల్యూమీనిక్స్ లిమిటెడ్‌లో, 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
తొలి ఆటాచ్మెంట్ హైదరాబాద్‌లోనే.
తయారీ యూనిట్ల కోసమని రుణాన్ని తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించారని, హైదరాబాద్‌లో కొన్ని భూమి అలా కొనుగోలు చేసిందనని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను బట్టి రూ.1,557 కోట్ల రుణాన్ని కంపెనీ యాజమాన్యంలోని ఇతర సంస్థలకు మళ్లించినట్లు తేలింది. కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్ల మీద సీబీఐ పలు కేసులు నమోదు చేసింది.