రియల్ ఎస్టేట్ స్టార్టప్ నో బ్రోకర్.కామ్ 51 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. సిరీస్ సీ రౌండ్లో భాగంగా జనరల్ అట్లాంటికా, సైఫ్ పార్టనర్స్, బీనెక్ట్స్లు ఈ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు అన్ని ఫండ్ రౌండ్స్ కలిపి నో బ్రోకర్ 71 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.
రియల్టీ సేవలే ఒక్కటే కాదు..
నో బ్రోకర్.కామ్ మధ్యవర్తిత్వ కమీషన్ లేకుండా ఉచితంగా టెక్ ఆధారిత రియల్ ఎస్టేట్ సేవలందిస్తుంది. ఇందులో గృహాల సెర్చింగ్తో పాటూ ప్యాకర్స్ అండ్ మూవర్స్, హోమ్ లోన్స్, క్లీనింగ్ వంటి సేవలు కూడా అందిస్తుంది. ప్రస్తుతం నో బ్రోకర్స్.కామ్ ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, గుర్గావ్ నగరాల్లో సేవలందిస్తుంది. సుమారు 25 లక్షల ప్రాపర్టీలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 60 లక్షల మందికి సేవలను అందించామని కంపెనీ తెలిపింది.