హైదరాబాద్‌లో తొలి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం శరవేగంగా ముస్తాబవుతోంది. ఉప్పల్‌లో 148 పిల్లర్లతో 6.2 కిలోమీటర్ల పొడుగునా నిర్మితవుతోంది. ఆధునిక టెక్నాలజీతో ఆరు లైన్ల వెడల్పుతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2018 జులై నెలలో కారిడార్ పనులకు శ్రీకారం చుట్టగా వచ్చే సంవత్సరం జూన్ 2020 వరకు పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఉప్పల్ నుంచి నారపల్లి వరకూ..
ఉప్పల్ ఎలక్ట్రికల్ జంక్షన్ నుండి ప్రారంభం అయ్యే కారిడార్ నారపల్లి సీపీఆర్ఐ వద్ద ముగుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.707 కోట్లు. ఇప్పటికే 45 పిల్లర్లు పూర్తయ్యాయి. నల్ల చెరువుపైన ఆరు పోర్టల్ బీమ్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎలివెటేడ్ కారిడార్‌తో పాటు 47 మీటర్ల అప్రోచ్ రోడ్డు, అందమైన ఫుట్‌పాత్‌లను నిర్మించనున్నారు. కారిడార్ పొడవునా రోడ్డుకు ఇరువైపులా 8 కిలోమీటర్ల వరకు ఫుట్‌పాత్ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ ఇబ్బందులు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్అండ్ బి అధికారులు అనాలోచిత పనులను ప్రయాణికులు నిత్యం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఒక్కప్పుడు ట్రాఫిక్ అంటే ఉప్పల్ చౌరస్తా నుంచి నల్ల చెరువు వరకు ఒకటిన్నర కిలోమీటర్ల మేర వరకే పరిమితమయ్యేది .. కాని ఇప్పుడు ఉప్పల్ చౌరస్తా నుంచి నారాపల్లి వరకు దాదాపుగా ఏడు కిలో మీటర్ల మేరకు నిత్యం ట్రాఫిక్ ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. కారిడార్ పిల్లర్ల నిర్మాణ పనులకు ముందే రోడ్డుకు ఇరువైపుల ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి పనులు ప్రారంభించాల్సి ఉండగా అవేమి పట్టించుకోకుండా పనులు ప్రారంభించడంతో నిత్యం వేలాది మందికి ట్రాఫిక్ చిక్కులు తప్పట్లేదు.
బైపాస్ రోడ్డుకు దిక్కేలేదు..
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పనులు దృష్ట్యా ప్రత్యమ్మాయ రోడ్లను అభివృద్ధి చేయాల్సిన అధికారులు కాలయాపన చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రోడ్డు అభివృద్ధి చేయడంలో అరంభ శూరత్వాన్ని ప్రదిర్శించిన అధికారులు ఇప్పుడు అ ఊసే ఎత్తడం లేదు.. బై పాస్ రోడ్డా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటూ వ్యంగాస్త్రాలు సందించడం శోచనీయం. అలీ కేఫ్ నుంచి ఉప్పల్ నల్ల చెరువు వరకు బై–పాస్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.