Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

తెలంగాణలో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్ట్స్‌

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఆరు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్స్, గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ప్రాంతాల్లో ఈ కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)ను కోరింది. కన్సల్టెన్సీ ఫీజు కోసం రూ.4.5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. ఇప్పటికే రూ.1.06 కోట్ల నిధులను విడుల చేసినట్లు సమాచారం.
కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ ఎక్కడంటే..
వరంగల్‌లోని మామునూరు, పెద్దపల్లిలో బసంత్‌నగర్, నిజామాబాద్‌లో జక్రాన్‌పల్లి, ఆదిలాబాద్‌ టౌన్, ఖమ్మలో కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లో అడ్డాకుల ప్రాంతాల్లో ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రహదారులు, రవాణా భవనాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో స్థలాల గుర్తింపు పూర్తయినట్లు తెలిసింది. బసంత్‌నగర్‌లో 750 ఎకరాలు, నిజామాబాద్‌లో 850 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 350 ఎకరాలను గుర్తించినట్లు గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అడ్డుంకులున్నాయ్‌..
అయితే రాష్ట్ర ప్రభుత్వ తలచిన కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ల ఏర్పాటులో కొన్ని అడ్డంకులున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌’పోర్టును నిర్మిచకూడదని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, జీఎంఆర్‌ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ వంటి కొన్ని చోట్ల భూములు వివాదంలో ఉన్నాయి.

Related Posts

Latest News Updates